కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి బిగ్‌షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌కి కరీంనగర్ మేయర్ సునీల్‌రావు రాజీనామా చేశారు. శనివారం బీజేపీలో చేరనున్నారు మేయర్ సునీల్‌రావు. మేయర్‌తోపాటు మరో 10మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సైతం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బండి సంజయ్ సమక్షంలో వీళ్లంతా బీజేపీ గూటికి చేరబోతున్నారు
బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు. BRSలో అవినీతిని భరించలేకే పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ.. ఇతర పనుల్లో అవినీతి జరిగిందని..ఆ అవినీతి నేత పేరును త్వరలోనే వెల్లడిస్తానన్నారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతి చిట్టా తన చేతిలో ఉందంటోన్న సునీల్‌రావు.. అవసరం వచ్చినప్పుడు గుట్టు విప్పుతానని టీవీ9తో చెప్పారు.
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. బీఆర్ఎస్‌కు 24 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో పది మంది పార్టీ వీడారు. దీంతో బీఆర్ఎస్ బలం 14కు పడిపోనుంది. బీజేపీకి ఇప్పటివరకు 16 మంది కార్పొరేటర్లు ఉండగా బీఆర్ఎస్ నుంచి 10 మంది చేరుతుండటంతో కమలం పార్టీ బలం 26కు చేరుతుంది. కాంగ్రెస్‌కు 12 మంది కార్పొరేటర్లు, ఎంఐఎంకు 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈనెల 26తో కరీంనగర్ కార్పొరేషన్ పాలకమండలి గడువు ముగియనుంది. ఈ సమయంలో మేయర్, కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ను వీడటం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్‌కు తనకు గ్యాప్ లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలవడం కరీంనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
Amaravati News Navyandhra First Digital News Portal