మీరు కరీంనగర్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా.? కానీ ఖర్చు విషయంలో వెనకాడుతున్నారా.? అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ కోసం ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) బడ్జెట్ టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. మరి ఆ ప్యాకేజీ వివరాలు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం..
ఐఆర్సిటిసి ప్రకటించిన ప్యాకేజీ పేరు కరీంనగర్ నుండి తిరుపతి. దీని SHR005A. ఈ టూర్ ప్యాకేజీలో తిరుపతి, శ్రీ కాళహస్తి కవర్ అవుతాయి. అయితే ఈ టూర్ ప్రతి గురువారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ రైలు ద్వారా కొనసాగుతుంది. ఈ యాత్ర మొత్తం 3 రాత్రులు, 4 రోజులు ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీ తొలిరోజు సాయంత్రం 07:19 గంటలకు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో కొనసాగుతుంది. 08:05 గంటలకు పెద్దపల్లి, 09:15 గంటలకు వరంగల్, 11:00 గంటలకు ఖమ్మంలో బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయి.
ఓవర్ నైట్ జర్నీ చేసిన తర్వాత రెండవ రోజు తిరుపతికి ఉదయం 07.50 గంటలకు చేరుకుంటారు. వెంటనే హోటల్‌ల్లో చెక్ ఇన్ అవుతారు. ఫ్రెష్ అయిన తర్వాత, తిరుచానూరు పద్మావతి, శ్రీ కాళహస్తి ఆలయాలు దర్శించుకొని హోటల్‌కు తిరిగి వస్తారు. రాత్రికి తిరుపతిలో బస చేస్తారు.
మూడవ రోజు తెల్లవారుజామున 02:30 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి ఉచిత క్యూ దర్శనం కోసం తిరుమలలో దిగుతారు. మధ్యాహ్నం దర్శనం పూర్తయిన తర్వాత హోటల్‌లో చెక్ అవుట్ చేసి సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకొని కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో రాత్రి 08:15 గంటలకు రిటర్న్ జర్నీ ఉంటుంది. తర్వాతి రోజు ఉదయం 03:26 గంటలకు ఖమ్మం, 04:41 గంటలకు వరంగల్, 05:55 గంటలకు పెద్దపల్లి, 08:40 గంటలకు కరీంనగర్ చేరుకుంటారు. దీంతో టూర్ పూర్తీ అవుతుంది.
ఈ టూర్ ప్యాకేజి స్లీపర్, థర్డ్ ఏసి అందుబాటులో ఉంటాయి. ధరల విషయానికి వస్తే స్టాండర్డ్ (స్లీపర్) సింగిల్ షేరింగ్ కోసం రూ. 12120, ట్విన్ షేరింగ్ అయితే రూ. 9030, ట్రిపుల్ షేరింగ్ రూ. 7250, 5-11 సంవత్సరాలు పిల్లలకు విత్ బెడ్ రూ. 4790, విత్ అవుట్ బెడ్ రూ. 3730గా ఉంది. అలాగే కంఫర్ట్ (థర్డ్ ఏసి)గాను సింగిల్ షేరింగ్ కోసం రూ. 14030, ట్విన్ షేరింగ్ అయితే రూ. 10940, ట్రిపుల్ షేరింగ్ రూ. 9160, 5-11 సంవత్సరాలు పిల్లలకు విత్ బెడ్ రూ. 6700, విత్ అవుట్ బెడ్ రూ. 5640గా నిర్ణయించారు.