Pan Card 2.0: పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

అసలేంటి PAN 2.O ప్రాజెక్ట్?
మొదటిసారిగా పర్మినెంట్ అకౌంట్ నెంబర్ PAN నుంచి 1972లో ఇన్ కమ్ ట్యాక్స్ చట్టాల్లోని సెక్షన్ 139A కింద పరిచయం చేశారు. ఇది పన్ను చెల్లించే వారి కోసం ఏర్పాటు చేసిన ఒక పర్మినెంట్ అకౌంట్. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ, వ్యయాలను లెక్క చూపేందుకు ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైన నెంబర్ ఇది. వాళ్లు చేసే ఎటువంటి లావాదేవీలైనా ఈ నెంబర్ ఆధారంగానే చెయ్యాల్సి ఉంటుంది. ఈ విషయం దాదాపు ట్యాక్స్ పేయర్స్ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోతున్న ఈ టూ పాయింట్ ఓ .. ఒక రకంగా సాంకేతిక వృద్ధిలో భాగంగా చేస్తున్న అప్ గ్రెడేషన్ అనుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు దశాబ్దాలుగా ఉన్న ఆ పాత, మూస విధానాన్ని ఇది మారుస్తుంది. డిజిటల్ పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

కొత్త పాన్ కార్డ్ ఎలా ఉంటుంది?
కొత్త పాన్ కార్డ్ విషయానికొస్తే ఇందులో ఓ క్యూఆర్ కోడ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఒక్క స్కాన్‌తో మొత్తం వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇదో విప్లవాత్మమైన మార్పు అని చెప్పొచ్చు. ఫలితంగా మరింత సెక్యూర్డ్‌గా ఆర్థికపరమైన లావాదేవీని జరపొచ్చు.

ట్యాక్స్ పేయర్స్‌‌కి ఏంటి లాభం?
కొత్త కార్డ్ యూజర్స్‌కి ఓ రకమైన డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. మరింత సులభంగా వినియోగించడం సాధ్యమవుతుంది. ఇకపై ఎలాంటి వ్యాపార లావాదేవీలకైనా ఈ కార్డును సార్వత్రిక గుర్తింపు కార్డుగా వినియోగించవచ్చు. గ్రీవెన్స్ రీఅడ్రెస్ సిస్టమ్‌‌ని కూడా అప్ డేట్ చేస్తారు. అలాగే పాన్ కార్డ్‌లతో ఎలాంటి అక్రమ లావాదేవీలు నిర్వహించకుండా ప్రొటెక్షన్ కోసం పాన్ డేటా వాల్డ్ సిస్టమ్‌ను కూడా సెటప్ చేస్తారు.

మరి ఇప్పుడున్న కార్డ్ సంగతేంటి? పని చేస్తుందా?
ప్రస్తుతం ఉన్న పాన్ కార్డ్ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదు. అది కూడా పని చేస్తుంది. 1972 నుంచి ఇప్పటి వరకు 78 కోట్ల పాన్ కార్డులు జారీ చేశారు. కొత్త డిజిటల్ కార్డ్ కోసం.. ప్రస్తుతం పాన్ కార్డ్ హోల్డర్లు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. అలాగే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతానికి కేంద్రం దీనికి సంబంధించి ఎలాంటి టైమ్ లైన్ వెల్లడి చెయ్యలేదు.

About Kadam

Check Also

టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *