వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. మంగళవారం రాత్రి కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా , పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేస్తున్నారు. కాగా కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరారని స్పష్టతనిచ్చారు.
Amaravati News Navyandhra First Digital News Portal