మీరు ఏటీఎంకి వెళ్లి ఇలా చేస్తున్నారా.. అయితే బీకేర్‌ఫుల్!

మీరు ఏటిఎంలో డబ్బులు డ్రా చేయడానికి లేదా.. డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా.. ఆలా ఏటీఎంకి వెళ్లినప్పుడు మీరు ఫోన్‌లో మాట్లాడుతూ.. పక్కనే ఉన్న వారు డబ్బులు తీసేందుకు హెల్ప్‌ చేస్తామాంటే ఒకే చెబుతున్నారా.. అయితే బీకేర్‌పుల్.. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు ఇలానే మిమ్మల్ని మాటల్లో పెట్టి సాయం చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడవచ్చు. తాజాగా ఇలానే ఓ వ్యక్తికి సహాయం చేస్తున్నట్లు నమ్మించిన బాధితుడి అకౌంట్‌ నుంచి సుమారు రూ.31 వేలు డ్రాచేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో వెలుగుచూసింది.

వివరాళ్లోకి వెలితే.. టేకుపల్లి గ్రామానికి చెందిన ఎలక్ట్రానిక్స్, నెట్ సెంటర్‌ నిర్వాహకుడు యదళ్లపల్లి బాలకృష్ణ తన దుకాణంలో పనిచేసే సూర్యతేజకు తన ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని రావాలని పంపించాడు. అయితే ఏటీఎంకు వెళ్లిన సూర్యతేజ ఫోన్‌లో మాట్లాడుతూ ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఏటీఎంలోకి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. డబ్బులు తీయడం అలా కాదని చెప్పి.. తేజను తికమకపెట్టి అతని కార్డును మార్చేసి వేరే కార్డుని ఇచ్చారు. అయితే ఇద్దరిలో ఓ వ్యక్తి సూర్యతేజకు సహాయం చేస్తున్నట్లు నటించాడు. ఫోన్‌లో బిజీగా మాట్లాడుతున్న సూర్యతేజ అవేమీ గమనించలేదు. డబ్బులు తీసి ఇస్తారు కదా అని వాళ్లకు ఏటీఎం పిన్ నెంబర్ కూడా చెప్పాడు.

ఇదే అదునుగా చేసుకున్న కేటుగాళ్లు.. డబ్బులు డ్రా చేస్తున్నట్టు కార్డును ఏటీఎం మిషన్‌లో పెట్టి పిన్‌ ఎంటర్ చేశారు.. వెంటనే దాన్ని క్యాన్సల్‌ చేసి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందంటూ తేజకు చెప్పారు. వెంటనే మిషన్‌లోని కార్డును తీసుకొని తమ చేతిలో ఉన్న మరో పనిచేయని కార్డును తేజకు ఇచ్చి ఒకరి వెనుకాల ఒకరు ఏటీఎం నుంచి జారుకున్నారు. అయితే వాళ్లు ఏటీఎం మార్చింది కనిపెట్టలేని సూర్యతేజ మరోసారి ప్రయత్నించగా ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్‌ అని రావడంతో తిరిగి షాప్‌కు వెళ్లిపోయాడు.

ఏటీఎం నుంచి షాప్‌కు చేరుకున్న సూర్యతేజ కార్డును తన యజమాని బాలకృష్ణకు అందజేశాడు. డౌట్‌ వచ్చి కార్డును పరిశీలించిన యజమాని ఈ కార్డు ఎవరిది అంటూ సూర్యతేజను అడగడంతో అతను కూడా బిత్తరపోయాడు. అయితే ఏటీఎం దగ్గర జరిగిన విషయాన్ని తేజ యజమానికి తెలియజేశాడు. దీంతో యజమాని అకౌంట్‌ చేక్‌ చేసుకోగా అందులో నుంచి రూ.31వేలు డ్రా అయినట్టు గుర్తించాడు. ఇక మోసపోయినట్టు గ్రహించి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

About Kadam

Check Also

వరంగల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటి

మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. కొండా ఫ్యామిలీపై పలు ఆరోపణలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *