కర్నూలు జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేస్తామని నమ్మ పలికిన ఒక కేటుగాడు మహిళల నుండి ఏకంగా కొట్ల రూపాయలు కాజేసి పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు నెలల తర్వాత ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేస్తామని మహిళలను నమ్మించిన ఒక వ్యక్తి వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదుతో పరారీలో ఉన్న జననీ మహిళా బ్యాంక్ సీఈఓ ఆకుల వెంకటరమణను ఎట్టికెలకు కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. కడప పట్టణానికి చెందిన ఆకుల వెంకటరమణ అనే వ్యక్తి కోవెలకుంట్ల, చాగలమర్రి ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లెలో జననీ పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ పేరుతో కార్యాలయాలు ప్రారంభించి, వాటిని మహిళా బ్యాంకులంటూ స్థానికులను నమ్మించాడు. ఈ బ్యాంక్‌లో పెట్టుబడి పెడితే తక్కువ టైంలోనే మహిళలను కోటీశ్వరులు చేస్తామని నమ్మ పలికాడు.
దీంతో తక్కువ సమయంలోనే ఎక్కవ డబ్బులు సంపాదించొచ్చు అనుకున్న స్థానిక మహిళలు వెంకటరమణకు చెందిన బ్యాంక్‌లలో పెద్ద మొత్తంలో డిపాజిట్స్ చేశారు. ఇలా మహిళల నుంచి డిపాజిట్ రూపంలో రూ.1.5 కోట్ల రాబట్టిన వెంకటరమణ.. వచ్చిన డబ్బును తీసుకొని పారిపోయాడు. దీంతో మోసపోయిన బాధ్యత మహిళలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే జూన్ రెండో తేదీన కోవెలకుంట్ల పీఎస్‌లో కేసు నమోదైనప్పటి నుంచి వెంకటరమణ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారు. ఇలా రెండు నెలలుగా చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వెంకటరమణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కడప పట్టణానికి చెందిన ఆకుల వెంకటరమణతో పాటు ఏడుగురిపై కోవెలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 3,920 మంది బాధితులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Amaravati News Navyandhra First Digital News Portal