2018లో ఆదోనిలో మిస్సింగ్‌.. కట్‌చేస్తే.. 7 ఏళ్ల తర్వాత…

కర్నూలు జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. 2018లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన శ్రీకాంత్ అనే బాలుడు దాదాపు 7 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అయితే ఓ రిహాబిలిటేషన్ సంస్థ కృషితో బాలుడు తన తల్లిదండ్రుల చెంతకు చేరగలిగాడు. తప్పిపోయాడనుకున్న తమ కొడుకును తీసుకొచ్చి అప్పగించినందుకు ఈ సంస్థ సిబ్బందికి శ్రీకాంత్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన శ్రీకాంత్ అనే బాలుడు, ఓ రిహాబిలిటేషన్ సంస్థ చేసిన కృషితో మళ్ళీ తిరిగి తన కుటుంబాన్ని కలిశాడు. కర్నూలు ఆదోని నగరంలో రోజు కూలీలుగా పనిచేసే వడ్డే శివశంకర్ లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్2018లో తన స్వగ్రామమంలో తప్పిపోయాడు. తప్పిపోయిన సమయంలో శ్రీకాంత్ వయస్సు కేవలం 8 ఏళ్లు మాత్రమే. అదోనిలో తప్పిపోయిన శ్రీకాంత్‌ అక్కడి నుంచి ట్రైన్‌లో విజయవాడకు చేరుకున్నాడు. అక్కడ శ్రీకాంత్‌కు గుర్తించిన స్థానికులు మొదట చైల్డ్ కేర్ అధికారులకు అప్పగించారు.

అయితే అనాథగా ఉండటంతో పాటు వివరాలు ఏమి చెప్పకపోవడంతో విజయవాడ కలెక్టర్ శ్రీకాంత్‌ను ఉయ్యూరులోని ఓ రిహాబిలిటేషన్ సంస్థలో చేర్పించారు. అయితే శ్రీకాంత్ అప్పటికే టిబీతో బాధపడుతు ఉండడంతో రిహాబిలిటేషన్ సంస్థ సిబ్బంది.. శ్రీకాంత్‌కు గుంటూరు టిబీ ఆసుపత్రిలో చేర్పించి మూడు నెలలపాటు చికిత్స అందించారు. చికిత్స అనంతరం శ్రీకాంత్‌ ఆరోగ్యంగా మారి, తన జీవితాన్ని పునః ప్రారంభించాడు.

అయితే ఎలాగైన శ్రీకాంత్‌ను తన తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్న రిహాబిలిటేషన్ సంస్థ అధికారులు ఎలాగోలా శ్రీకాంత్‌ ఆధార్‌ కార్డును కనుగొన్నారు. దానిలోని వివరాల ఆధారంగా వారి తల్లిదండ్రులను గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శ్రీకాంత్ ను తన తల్లిదండ్రులైనా శివశంకర్ లక్ష్మి దంపతులకు అప్పగించారు. 8 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన బిడ్డను కలిసినందుకు తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయాడు సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

About Kadam

Check Also

భర్తలు విసుక్కుంటే పడొద్దు.. ఫ్రీ బస్సు ఎక్కి హ్యాపీగా పుట్టింటికి వెళ్లిపోండి: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

భర్తపై అలిగితే ఫ్రీ బస్సు ఎక్కి పుట్టింటింటికి వచ్చేయండి.. మగాళ్లే టికెట్ పెట్టుకుని వచ్చి కాపురానికి తీసుకువెళతారు.. ఇదన్నది ఎవరో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *