అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. 2 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మత్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో కోనపాపపేట వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాల కోసం లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ను చూడండి..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ, రేపు కోస్తాలో వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్‌చార్జ్‌ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు.. తీవ్ర అల్పపీడడం వాయువ్యదిశగా ప్రయాణిస్తుందన్నారు. ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లి.. ఆ తర్వాత ఉత్తరం వైపు గమనం మార్చుకుంటుందని చెప్పారు.

దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. అలాగే కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు.. ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయన్నారు.

డిసెంబర్20, శుక్రవారం వెదర్ రిపోర్ట్: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం,నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తీరం వెంబడి బలమైన గాలులు: తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో .. సముద్రం అల్లకల్లోలంగా మారిందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టులతో పాటు.. దక్షిణ కోస్తాలోని మచిలీపట్నం పోర్టుకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు వాతావరణ శాఖ నిఫుణులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆందోళనలో ప్రజలు: మరోవైపు అల్పపీడనాల హెచ్చరికలతో కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. రాకాసి అలల తాకిడికి గత రెండు నెలల వ్యవధిలో మూడు తుపాన్ల ప్రభావంతో దాదాపు 200 ఇళ్లు సముద్రగర్భంలో కనుమరుగైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకూ కిలోమీటరు మేర సముద్రం ముందుకొచ్చిందంటున్నారు. దీనిపై పలుసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా రక్షణ గోడ నిర్మించలేదంటున్నారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *