ఫెయింజల్ తుఫాన్ అలజడి రేపింది.. తీరం దాటినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం (డిసెంబర్ 02, 2024) IST 08 30 గంటల సమయంలో ఉత్తర అంతర్గత తమిళనాడు మీదుగా బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం (తుఫాను”ఫెయింజల్”) అదే ప్రాంతంలో కొనసాగుతొంది. డిసెంబర్ 3, 2024 నాటికి అవశేష అల్పపీడన ప్రాంతం, ఉత్తర కేరళ కర్ణాటక తీరానికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా కొనసాగే అవకాశము ఉన్నది. దీని ప్రభావంతంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.. అంతేకాకుండా.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల (డిసెంబర్ 4 2024 వరకు) వరకు వాతావరణ సూచనలు కూడా చేసింది.. మూడు రోజులు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:- సోమవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. మంగళవారం బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :- సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.
నేటి వెదర్ రిపోర్ట్ – ఈ ప్రాంతాల్లో వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Amaravati News Navyandhra First Digital News Portal