గత వారం రోజులుగా బాలాజీ నగర్ ప్రాంతానికి చీకటి పడితే చాలు వచ్చేస్తున్న చిరుతలు రోజు ఏదో ఒకచోట స్థానికులకు కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపు 1000 కి పైగా కుటుంబాలు నివాసం ఉన్న బాలాజీ నగర్ పరిసరాల్లో ఉండే కుక్కలు పిల్లులు కోసం చిరుతలు వస్తున్నాయి. కుక్కల్ని పిల్లులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే బాలాజీ నగర్ లోని బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద మాటువేసి..
శేషాచలం కొండల్లోని చిరుతలు జనావాసాల వైపు పరుగులు పెడుతున్నాయి. తిరుమల అడవుల్లో పెరుగుతున్న చిరుతల సంతతి జనం లోకి వస్తుండడంతో ఆందోళన నెలకొంది. ఇందులో భాగంగానే తిరుమలలో తరచూ చిరుతల సంచారం కలవరపెడుతోంది. తిరుమల అటవీ ప్రాంతం చుట్టూ 10.2 కిలోమీటర్ల మేర ఔటర్ కారిడార్ ఇనుప కంచె నిర్మాణం జరిగినా చిరుతలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి. తరచూ జనావాసాల్లోకి వస్తున్న చిరుతలు ఈ మధ్యకాలంలో శిలాతోరణం క్యూలైన్ వద్ద, అన్నమయ్య భవన్ వెనుక వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ వద్ద, మొదటి ఘాట్ రోడ్ లో సంచరిస్తూ కనిపించాయి. ఇప్పుడు బాలాజీ నగర్ లో ప్రత్యక్షమవుతున్నాయి.
గత వారం రోజులుగా బాలాజీ నగర్ ప్రాంతానికి చీకటి పడితే చాలు వచ్చేస్తున్న చిరుతలు రోజు ఏదో ఒకచోట స్థానికులకు కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపు 1000 కి పైగా కుటుంబాలు నివాసం ఉన్న బాలాజీ నగర్ పరిసరాల్లో ఉండే కుక్కలు పిల్లులు కోసం చిరుతలు వస్తున్నాయి. కుక్కల్ని పిల్లులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే బాలాజీ నగర్ లోని బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద మాటువేసి పిల్లిని పట్టుకునే ప్రయత్నం చిరుత చేసింది.
Amaravati News Navyandhra First Digital News Portal