డిగ్రీ అర్హతతో.. ఎల్‌ఐసీలో భారీగా ఉద్యోగాలు! ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం

దేశ వ్యాప్తంగా పలు LIC బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC).. దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 51
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 22
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 88
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 38
  • జనరల్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 142

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 8, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మాత్రం ఇంటిమేషన్‌ ఛార్జెస్‌ రూ.85 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకు జీతంగా చెల్లిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 3, 2025వ తేదీన నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్ష నవంబర్‌ 8, 2025వ తేదీన నిర్వహిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

About Kadam

Check Also

చారిత్రాత్మక క్షణం..! తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్ అందుకున్న ప్రధాని మోదీ

భారతదేశం సెమీకండర్టర్ల రంగంలో వేగంగా కదులుతోంది. ప్రధానమంత్రి మోదీ మంగళవారం (సెప్టెంబర్ 2) ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *