డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

ఎల్‌ఐసీ హైసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ హెచ్‌సీఎల్‌) దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో.. అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు జూన్‌ 28, 2025వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీలో 20, తెలంగాణలో 24 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2025, జూన్‌ 1 నాటికి డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్థుల వయోపరిమితి 20 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ. 944, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 708 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 472 ఫీజు చెల్లించాలి.

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష జూలై 3, 2025న నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రతి నెలకు రూ.12,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోండి.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *