ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్… రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం

తెలంగాణలో స్థానికసంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. హైకోర్టు గడువులోపు ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ సూచించింది. ఇప్పటికే ZPTC, MPTC, సర్పంచ్‌ స్థానాలు ఖరారు చేసింది. ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్‌ ఆర్డినెన్స్‌కి ఆమోదం తెలుపుతారా లేదా.. లేదంటే ఏం చేయాలనేదనిపైనా కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇప్పటికే ZPTC, MPTC, పంచాయితీ స్థానాల్ని నిర్థారించింది ప్రభుత్వం. మొత్తం 566 ZPTC, 5,773 MPTC స్థానాలు ఉండగా, 12,778 గ్రామ పంచాయతీలు.. 1 లక్ష 12 వేల వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి,. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌కి గవర్నర్ ఆమోదంపై ఉత్కంఠ కొనసాగుతుంది. 285-A నిబంధన ప్రకారం పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ కోరింది ప్రభుత్వం.

ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదిస్తే చట్టసవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్.. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. అయితే.. గవర్నర్ ఆమోదిస్తారా.. లేదా.. అనేది ఉత్కంఠగా మారింది.

అయితే ఆర్డినెన్స్ తేవడాన్ని బీఆర్‌ఎస్‌, బీజేపీ తప్పుపడుతున్నాయి. బీసీలను మోసం చేయాలని చూస్తే మరో భూకంపం వస్తుందని బీఆర్‌ఎస్ హెచ్చరిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటోంది కాంగ్రెస్. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ బిల్లు క్లియర్ అవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఈ ఆర్డినెన్స్‌ను ఎవరూ అడ్డుకోవద్దంటూ బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

మరోవైపు ఆర్డినెన్స్‌పై తేలకపోతే పార్టీ పరంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది.

About Kadam

Check Also

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. గతంలో గచ్చిబౌలి పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేత!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గచ్చిబౌలి పీఎస్‌లో గతంలో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *