మా పెళ్లికి తప్పకుండా రండి అంటూ వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. ఓపెన్‌ చేసి చూడగా..

రోజురోజుకూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో జనాలను నిండా ముంచి.. అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగు చూసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ రాగా.. ఎవరిదా అని ఒపెన్‌ చేశాడు. అంతే అతని అకౌంట్లోంచి రూ.2లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు.
వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ను ఓపెన్‌ చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి రూ.2లక్షలు పొగొట్టుకున్న ఘటన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హింగోలీకి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి గుర్తుతెలియని నెంబర్ నుంచి వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ వచ్చింది. ఆ మెసెజ్‌లో “ఆగస్టు 30న మా వివాహం, మీకు తప్పకుండా రావాలి అని రాసి ఉంది. దానీ కిందే ప్రేమ అనేది ఆనంద ద్వారం తెరిచే మాస్టర్ కీ’ అని రాసి ఉన్న ఒక ఏపీకే ఫైల్‌ కనిపించింది.

అయితే అది పెళ్లి పత్రిక అనుకున్న ఆ ప్రభుత్వ ఉద్యోగి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ ఏపీకే ఫైల్‌పై క్లిక్‌ చేశాడు. అయితే అది సైబర్‌ నేరగాళ్లు పంపించిన ప్రమాదకర ఏపీకే ఫైల్ కావడంతో వెంటనే అది ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయిపోయి. అతని ఫోన్‌ యాక్సెస్‌ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అతని ఫోన్‌లోంచి ఫోటోలు, కాంటాక్టులు నెంబర్స్‌ వంటికి సేకరించిన కేటుగాళ్లు క్షణాల్లోనే అతని బ్యాంక్‌ ఖాతా నుంచి సూమారు రూ.1.90లక్షలు ఇతర ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు.

దీంతో మోసపోయినట్టు గుర్తించిన బాధితులు వెంటనే సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Kadam

Check Also

SBI బ్యాంక్‌లో ఆడిట్‌కు వచ్చిన సిబ్బంది.. ఓ బుక్‌లో రాసినవి చూడగా..

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్-2లో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *