మారిన జీవన విధానం, వాతావరణంలో మార్పులతో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం వయసుతో సంబంధంలేకుండా క్యాన్సర్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతోంది.క్యాన్సర్ కు చికిత్స అతి ఖరీదైనది. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను కొనుగోలు చేయడం అనేది సామాన్యులకు భారంగా నేపధ్యంలో.. క్యాన్సర్ రోగులకు కేంద్రం గొప్ప ఉపశమనం కలిగించింది.
ఖరీదైన వ్యాధిగా మారిన క్యాన్సర్ బాధితులకు కేంద్రం గొప్ప ఉపశమనం కలిగించింది. మూడు రకాల క్యాన్సర్ సంబంధిత మందులపై కస్టమ్ డ్యూటీని తొలగిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్‌సభలో ప్రకటించింది. ఫార్ములేషన్‌లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బిసిడి)ని సున్నాకి తగ్గించినట్లు కేంద్రం నోటిఫికేషన్‌లు జారీ చేసింది. ఈ యాంటీకాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించమని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లకు అనుగుణంగా ఈ ఔషధాల తయారీదారులు ఈ మందులపై ఎంఆర్‌పిని తగ్గించారని.. ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ)కి సమాచారాన్ని అందించారని ఆమె చెప్పారు.
మూడు క్యాన్సర్ నిరోధక ఔషధాలపై..
ట్రాస్టూజుమాబ్ డెరక్స్‌టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ ఔషధాలపై తయారీదారులు గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి)ని తగ్గించడం ప్రారంభించారని.. ఈ ప్రయోజనం క్యాన్సర్ బాధితులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు శుక్రవారం పార్లమెంటుకు తెలియజేసింది. GST రేట్లలో తగ్గింపు, కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు కారణంగా ట్రాస్టూజుమాబ్ డెరక్స్‌టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ ఔషధాలపై MRP తగ్గించాలని కంపెనీలను ఆదేశిస్తూ NPPA ఒక మెమోరాండం జారీ చేసింది. తద్వారా తగ్గిన పన్నులు, సుంకాల ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి.. మందుల ధరల్లో వచ్చిన మార్పుకి సంబందించిన గురించి సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలని సూచించారు.