రుణుడి ప్రతాపం షురూ అయ్యింది..! ఇక ఇప్పటి నుంచి వాతావరణంలో మార్పులు జరగబోతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు ఎలా ఉండబోతోంది.? ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.
రాయలసీమ, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం , ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3 .1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది. ఉత్తర కేరళ, పరిసర ప్రాంతాలలో నున్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక , పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉంది.
తూర్పు-పశ్చిమ ద్రోణి 10°ఉత్తర అక్షాంశం వెంబడి ఇప్పుడు తూర్పు మధ్య అరేబియా సముద్రం దక్షిణ భాగాల నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక & తమిళనాడు మీదుగా మధ్య బంగాళాఖాతం దక్షిణ భాగాల వరకు నైరుతి బంగాళాఖాతం , ఉత్తర తమిళనాడు తీర ప్రాంతములో నున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 7 .6 కి.మీ ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉన్నది .
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
ఈరోజు :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రేపు , ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రేపు , ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
ఈరోజు , రేపు , ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.