ఏపీ సీఎం చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఒక బహుమతి ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చిన తన ప్రియ మిత్రుడు బిల్‌గేట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈమేరకు బిల్‌గేట్స్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇది ఒక అంతర్‌దృష్టి పూర్వక, ప్రేరణాత్మక పఠనం అవుతుందన్నారు. బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్ బహుమతిగా ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కాలేజీని వదిలి మైక్రోసాఫ్ట్‌ సంస్థను ఎలా ప్రారంభించారు? ఆయన జీవనయాత్రనకు సంబంధించిన అనుభవాలు, పాఠాలను ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. ఈ పుస్తకం చాలా మందికి స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్ గేట్‌కు ఆల్ ది బెస్ట్ తోపాటు కృతజ్ఞతలు చంద్రబాబు తెలిపారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఎకానమీ ఫోరమ్ సదస్సులో వీరిద్దరూ భేటీ అయిన సంగతి తెలిసిందే..!

బిల్‌గేట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈమేరకు బిల్‌గేట్స్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘నా ప్రియ మిత్రుడు బిల్‌గేట్స్ తన రాబోయే పుస్తకం ‘సోర్స్ కోడ్’ప్రతిని నాకు అందజేసినందుకు ధన్యవాదాలు’ అని చెప్పారు. ‘ఈ పుస్తకం ఆయన జీవనయాత్రను తెలియజేస్తుంది. ఇది ఒక అంతర్‌దృష్టిపూర్వక, ప్రేరణాత్మక పఠనం అవుతుంది’ అంటూ బిల్‌గేట్స్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో వేట కొనసాగించారు సీఎం చంద్రబాబు. మూడ్రోజుల పాటు పలు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు చంద్రబాబు. ఏపీలో పెట్టబడులు పెట్టాలని కోరారు. పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరపారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, పెట్రోనాస్‌, పెప్సికో ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. గతంలో వీరికి ఉన్న అనుబంధాన్ని మరోసారి పంచుకున్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావల్సిందిగా బిల్‌ గేట్స్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు తన జీవిత ప్రయాణానికి సంబంధించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *