మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి సీతక్క..! ఒక మహిళ అని కూడా చూడకుండా..

తాజాగా మంత్రి సీతక్కపై వెలుగులోకి వచ్చిన మావోయిస్టు లేఖపై ఆమె స్పందించారు. ఇది నిజమైన బెదిరింపు లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అనేది తెలియాల్సి ఉందని అన్నారు. ఆదివాసి మహిళగా తనకు మంత్రి పదవి రావడం కొందరికి జీర్ణం కాలేదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మావోయిస్టుల పేరుతో ఇటీవలె మంత్రి సీతక్కపై ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ లేఖపై సీతక్క స్పందించారు. ఆ లేఖలో ములుగులో ఆదివాసీల గెంటివేతపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణలో ఆదివాసీల పరిరక్షణ బాధ్యత సీతక్కదే, ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీల కోసమే జీవో 49. ఆ జీవోతో కుమ్రంభీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మాయం కావడం పక్కా! ఆదివాసీల గురించి రాహుల్‌గాంధీ చెప్తున్నదేమిటి? రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు చేస్తున్నదేమిటి? పోడు భూములకు పట్టాలు, రైతుభరోసా ఇవ్వాలంటూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరుతో ఒక లేఖ సంచలనం సృష్టించింది. అది నిజంగానే మావోయిస్టులు రాసిన లేఖనా? లేక ఎవరైనా కావాలని తనపై కుట్రతో లేఖను సృష్టించారా అని అనుమానం వ్యక్తం చేస్తూ.. దానిపై నిజం తేలాల్సి ఉందని అన్నారు.

ఇంకా మంత్రి మాట్లాడుతూ.. “నాపై మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ బాధాకరం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఆదివాసి బిడ్డకు మంత్రి పదవి దక్కితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. నా పర్శనాలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మావోయిస్టుల లేఖా..? లేక నేనంటే గిట్టని వాళ్లు కుట్ర పూరితంగా సృష్టించిన లేఖా..? అనేది తేలాల్సి ఉంది. ఆ లేఖను ముందుపెట్టి కొందరు నాపై రాజకీయ కక్షను వెళ్లగక్కుతున్నారు.

నన్ను ఓడించాలని నాడు వంద కోట్ల వరకు పెట్టారు. నాకు మంత్రి పదవి వచ్చినప్పటినుండి ఎప్పుడు దించాలి అని చూస్తున్నారు. GO 48ను రద్దు చేయాలని తీర్మానం చేశాం. ప్రతిపక్షంలో పోరాటం.. అధికారంలో సమస్యల పరిష్కారమే నా బాధ్యత. నేను ఒక మహిళను అని కూడా చూడకుండా బాధాకరంగా ప్రచారాలు చేస్తున్నారు. అట్టడుగు వర్గాల కోసమే నా పోరాటం.. ఆరాటం. గత ప్రభుత్వంలో చెట్లకు కట్టేసి కొట్టారు. ఆదివాసి బిడ్డను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా.. ఆదివాసీలకు ఎందుకు భూమి ఇవ్వలేదు.” అని మంత్రి సీతక్క అన్నారు.

About Kadam

Check Also

మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు… శ్రీకాంత్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. స్కామ్‌ల మీద స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *