తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం 3 విడతల్లో రూ. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమే చేశారు. మెుత్తం 18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. అయితే అర్హతలు ఉన్నా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో కారణాలతో కొందరు రైతులకు మాఫీ వర్తించలేదు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వ్యవసాయ అధికారులు వారి వివరాలు సేకరించారు. తాజాగా ఆయా రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు.
వివిధ కారణాలతో తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ జరగలేదని అన్నారు. ఆయా రైతులు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ఏడాది పాలనను పురస్కరించుకొని ప్రజా పాలన విజయోత్సవాలు నిర్విహిస్తున్నామని.. అందులో భాగంగా ఈనెల 30న పాలమూరులో రైతుపండగ కార్యక్రమం జరపనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం వేదికగా.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బుధవారం (నవంబర్ 27) వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Amaravati News Navyandhra First Digital News Portal