కజకిస్తాన్‌ రాయబారితో నవాబ్‌ మీర్‌ కీలక భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ఎయిర్ కనెక్టివిటీ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి హైదరాబాద్, అల్మట్టి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని డాక్టర్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ విమాన సర్వీసుల ద్వారా వైద్య, పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, కజకిస్తాన్ పౌరులకు హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఆరోగ్య..

హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారుడు డాక్టర్‌ నవాబ్‌ మీర్‌ నాసిర్‌ అలీఖాన్‌ ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి అజామత్ యెస్కరాయేవ్‌ను కలిశారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన కజకిస్తాన్‌ రాయబారి.. ఏపీ, తెలంగాణకు హైదరాబాద్‌లో కజకిస్తాన్‌ రాయబారి కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ నవాబ్‌ మీర్‌ నాసిర్‌ అలీఖాన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారతదేశం, కజకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. తెలంగాణ, కజకిస్తాన్ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పెంపొందించడంతో పాటు వాణిజ్యం, పర్యాటకం, మౌలిక సదుపాయాల రంగాలలో కూడా అభివృద్ధి చేయడానికి ఆసక్తిని కనబర్చారు.

ఎయిర్ కనెక్టివిటీ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి హైదరాబాద్, అల్మట్టి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని డాక్టర్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ విమాన సర్వీసుల ద్వారా వైద్య, పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, కజకిస్తాన్ పౌరులకు హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు, ఆసుపత్రులకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు

తెలంగాణ, కజకిస్తాన్‌ మధ్య రవాణా సదుపాయాలు, ఎగుమతులు, దిగుమతుల సజావుగా కొనసాగించడానికి తోడ్పడుతుందని, రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, తద్వారా ఆర్థిక వృద్ధి, వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుందని డాక్టర్ ఖాన్ పేర్కొన్నారు.

కజకిస్తాన్‌లో భారతీయ ఆసుపత్రులు, హోటళ్ళు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, మౌలిక సదుపాయాల సాంకేతికతను ప్రోత్సహించడం గురించి కూడా డాక్టర్ ఖాన్ చర్చించారు. కజకిస్తాన్ గొప్ప ఖనిజ రంగంలో పెట్టుబడి, సహకార అవకాశాలను అన్వేషించడానికి భారతీయ మైనింగ్ కంపెనీలకు ఉన్న సామర్థ్యాన్ని ఆయన తెలియజేశారు.

భారతదేశం, కజకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా, కజకిస్తాన్ రాయబారి అజామత్ యెస్కరాయేవ్ డిప్లొమాటిక్ ఎక్సలెన్స్ అవార్డును నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌కు అందజేశారు. అజామత్‌కు హైదరాబాద్ సందర్శించమని అధికారిక ఆహ్వానం పంపారు. రాయబారి ఆహ్వానాన్ని అంగీకరించి, నగరాన్ని సందర్శించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.

About Kadam

Check Also

చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..

ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *