గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారని ఆయన రోపించారు. ‘నేను రిజైన్ లెటర్ కిషన్ రెడ్డికి ఇచ్చాను. ఈ లెటర్ స్పీకర్ కు పంపించమని చెప్పానని ఆయన తెలిపారు. నాకు మద్దతుకు వచ్చిన వారిని బెదిరించారని ఆయన ఆరోపించారు. నాకు ముగ్గురు కౌన్సిల్ మెంబెర్స్ మద్దతుగా సంతకం పెట్టారని తెలిపారు. ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసినప్పుడు ఎన్నిక ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ రావొద్దని అనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుతుందన్నారు.
బీజేపీ అధ్యక్ష పదవికి తన సిఫార్సు చేసిన అభ్యర్థిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన, పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Amaravati News Navyandhra First Digital News Portal