నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది.. నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడుతా.. అంటూ కేసీఆర్ కూతురు కవిత పేర్కొన్నారు. జన్మనిచ్చిన తండ్రి చిటికన వేలు పట్టుకుని ఉద్యమం చేయడం నేర్చుకున్నా.. నాపై ఇద్దరు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటే ఏమిటి..? హరీష్‌రావు, సంతోష్‌రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు.. అంటూ కవిత పేర్కొన్నారు. తనపై కుట్ర జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ స్పందించవద్దా? బీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి.. అంటూ కవిత తెలిపారు. బీఆర్ఎస్‌ను హస్తగతం చేసేందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ నుంచి సస్పెండ్ తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ నుంచి ప్రకటన వచ్చిందని.. ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలపాలతో సస్పెండ్ చేశారంటూ కవిత పేర్కొన్నారు.
జైలు నుంచి వచ్చిన తర్వాత గురుకులాలపై పోరాటం చేశానని.. పెన్షన్లు పెంచాలని ఉద్యమాలు చేశానని.. బనకచర్లపై రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశాను.. సీఎం జిల్లాలో భూనిర్వాసితులకు అండగా నిలబడ్డాను.. అంటూ కవిత పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ కోసం పోరాడితే.. పార్టీకి ఎందుకు వ్యతిరేకం అవతుందంటూ కవిత ప్రశ్నించారు. నా
కాళేశ్వరంను తుమ్మడిహట్టి దగ్గర నుంచి మార్చినప్పుడు మంత్రి ఎవరు? .. హరీష్, సంతోష్ వల్లే విషయం CBI విచారణ వరకు వచ్చింది.. రేవంత్, హరీష్ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ కళ్ల ముందు కనిపిస్తుంది.. అంటూ కవిత పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరూ ఫ్లైట్ లో ప్రయాణం చేశారని.. హరీష్ కేటీఆర్ కు సరేండర్ అయ్యారని పేర్కొన్నారు.
అన్నయ్య కేటీఆర్‌కి కవిత సూటి ప్రశ్నలు..
నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పాను.. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించరా..?.. బంధుత్వం పక్కన పెట్టండి.. మహిళా ఎమ్మెల్సీ బాధపడితే అడగరా అన్నా..? అంటూ కవిత పేర్కొన్నారు. రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు అంటూ పేర్కొన్నారు. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది.. అంటూ పేర్కొన్నారు. నా ప్రాణం పోయినా.. కేసీఆర్, కేటీఆర్ కు హాని చేయాలని కోరుకోనని కవిత అన్నారు.
ఎమ్మెల్సీ, పార్టీకి రాజీనామా..
బీఆర్ఎస్ పార్టీతోపాటు.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో లేఖను పంపుతున్నట్లు ప్రకటించారు. పదవులు తనకు ముఖ్యం కాదని పేర్కొన్నారు.