మర్కాజీ రూట్-ఎ-హిలాల్ కమిటీ రబీ ఉల్ అవ్వల్ 1447 AH (2025) నెలవంక కనిపించినట్లు ప్రకటించింది. ఆగస్టు 25, సోమవారం నుండి రబీ ఉల్ అవ్వల్ ప్రారంభం అవుతుంది. దీని ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం అయిన ఈద్ ఎ మిలాదున్ నబీ సెప్టెంబర్ 5, శుక్రవారం జరుపుకుంటారు.
రబీ ఉల్ అవ్వల్ 1447 AH/2025 నెలవంక కనిపించినట్లు మర్కాజీ రూట్-ఎ-హిలాల్ కమిటీ (మూన్ సైటింగ్ కమిటీ), మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-డక్కన్ ప్రకటించింది. రబీ ఉల్ అవ్వల్ ఆగస్టు 25 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని మోజ్జం జాహి మార్కెట్‌లోని హుస్సేని భవనంలో ఉన్న కమిటీ అధ్యక్షుడు అల్లామా సయ్యద్ హసన్ ఇబ్రహీం హుస్సేని క్వాద్రి (సజ్జాద్ పాషా) కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
అధికారిక ప్రకటన జారీ చేయడానికి ముందు, హైదరాబాద్ అంతటా ఉన్న ప్రముఖ పండితులు, మత ప్రముఖులు ఈ సమావేశంలో చంద్రదర్శన నివేదికలను ధృవీకరించారు. కొత్త నెల ముస్లిం సమాజానికి ఆశీర్వాదాలు, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని సజ్జాద్ పాషా ప్రార్థించారు. ఈ ప్రకటన ఆధారంగా 12వ రబీ ఉల్ అవ్వల్ నాడు జరుపుకునే ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినమైన ఈద్ ఎ మిలాద్ ఉన్ నబీ, ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 శుక్రవారం నాడు వస్తుంది. సో.. సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ జరుపుకోనున్నారు ముస్లిం సోదరులు.