బడిపంతులుగా మారిన కర్నూలు ఎంపీ.. క్లాస్ రూంలో కాసేపు ఇలా..

ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ తాను లెక్చరర్ గా పని చేసిన కళాశాలకు ఎం.పి హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. లెక్చరర్ గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానన్నారు.ఇంటర్ లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ ఆయన తాను , కెమిస్ట్రీ సబ్జెక్టు పై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యానన్నారు.ఇక విద్యార్థులు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.

కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు చాక్ పీస్ పట్టుకొని క్లాస్ రూంలో కాసేపు పాఠాలు చెప్పారు.ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కలశాల వార్షికోత్సవం లో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. అయితే ఎం.పి గతంలో ఈ కళాశాల లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేసారు.లెక్చరర్ గా ఉన్న సమయంలో తాను పాటలు చెప్పిన క్లాస్ రూమ్ ను సందర్శించిన ఆయన అనంతరం కాసేపు పాఠాలు చెప్పి నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

About Kadam

Check Also

ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు మీరూ రాత పరీక్ష రాశారా? కీలక అప్‌డేట్స్ ఇవే..

ఇటీవల నిర్వహించిన లోకో పైలట్‌ 2024 సీబీటీ 2 (RRB ALP) పరీక్షల ఫలితాలు బుధవారం (జులై 2) విడుదలయ్యాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *