అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పిచ్చిన వ్యక్తిని పథకం ప్రకారం కత్తులతో పొడిచి చంపించేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మందిని అరెస్ట్‌ చేశారు.

నంద్యాల పట్టణానికి చెందిన పరుచూరి అశోక్ అనే వ్యక్తిని పథకం ప్రకారం పాణ్యం శివారులోని5 ఓ సోడ షాపు పిలిపించి కత్తులతో పొడిచి చంపిన ఘటనలో పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి కత్తులు, సుత్తె, రాడ్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో నలుగురు మైనర్లు కూడా ఉన్నట్టు సిఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. హత్యకు అర్థికలావాదేవిలే కారణంగా పోలీసులు తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల పట్టణానికి చెందిన పరుచూరి అశోక్ అనే వ్యక్తి ఓ ప్రయివేటు ఆసుపత్రిలో క్యాంటిన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూన్నాడు‌. మృతుడు అశోక్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు పట్టణంలోని బోమ్మలసత్రంలో ఓ ప్రయివేటు అపార్ట్మెంట్‌లో నివాసం ఉండేవారు. ఆసుపత్రిలో క్యాంటిన్‌తో పాటు వీళ్లు వడ్డీకు డబ్బులు కూడా అప్పుగా ఇచ్చేవారు.

ఈ క్రమంలో గతంలో తన వద్ద క్యాంటిన్‌లో పని చేసిన సుబ్బయ్య అనే వ్యక్తి రూ. 48 లక్షలు అప్పుగా వడ్డీకి ఇచ్చాడు. ఇచ్చిన డబ్బులలో 26 లక్షలు చెల్లించిన సుబ్బయ్య ఇంకా మిగిలిన రూ. 22 లక్షలు డబ్బుల విషయంపై కొన్ని రోజులుగా ఇద్దరు మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. గత వారం రోజుల క్రితం సుబ్బయ్య ఇంటి వద్దకు వెళ్ళి మృతుడు అశోక్ డబ్బు విషయంపై నిలదీశాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న సుబ్బయ్య అతని కుమారుడు సురేష్ ఎలాగైన అశోక్‌ను అంతమెందించాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో అదివారం డబ్బుల విషయం మాట్లాడటానికి పాణ్యం శివారులో గల తన సోడా షాపు రావాలని సుబ్బయ్య అశోక్ సమాచారం ఇచ్చాడు. అశోక్ ఒంటరిగా తన కారులో సుబ్బయ్య సోడ షాపు వద్దకు వెళ్ళాడు. ముందే అనుకున్న పథకం ప్రకారం సుబ్బయ్య అతని కుమారుడు సురేష్, స్నేహితుడు రమేష్‌తో పాటు మరో ఏడు మంది కలిసి అశోక్‌పై మూకుమ్మడి దాడికి దిగారు. మొదట అశోక్‌ను వెనుక వైపు నుంచి తలపై సుత్తెతో కొట్టి అ తర్వాత సుబ్బయ్య, సురేష్, రమేష్ కత్తులతో పొడిచిచంపి అక్కడి నుంచి పరారయ్యారు. హత్య విషయం తెలుసుకున్న నంద్యాల ఎఎస్పీ మందా జావళి,పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సై నరేంద్ర నాథ్ రెడ్డి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు.

పోలీసుల విచారణలో హత్య ఘటనపై విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. మృతుడు ఆశోక్ పై పదుల సంఖ్యల కేసులు ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా హత్య జరిగింది ఓ బెల్ట్‌ షాప్‌లో, అ బెల్ట్ షాపు గత కొన్ని నెలలుగా నడుస్తూన్న పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

About Kadam

Check Also

చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష..

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంటిబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *