పర్మిషన్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే.. ఏసీబీకి చిక్కిన మరో లేడీ ఆఫీసర్!

రాష్ట్రంలో అవినీతి పరులను ఏరిపారేడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్న ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి పట్టుపడింది. హైదరాబాద్‌లోని నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టుపడ్డారు. అమె నుంచి రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్న కొందరిలో మాత్రం అస్సలూ మార్పు రావడం లేదు. మనల్ని ఎవరులే పట్టుకునేది అనేలా జనాల నుంచి లంచాలు లాగేస్తున్నారు. తాజాగా ఇలానే ఒక పనిచేసిపెట్టేందుకు ఒక అధికారిని ఏకంగా రూ.10లక్షలు డిమాండ్ చేసింది. అడ్వాన్స్‌గా రూ.4లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణిహారిక.. మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్‌లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు వినోద్‌ అనే వ్యక్తి నుంచి మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది.

ఈ క్రమంలో వినోద్‌ నుంచి టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె నుంచి డబ్బును స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు చేశారు. వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మణిహారిక పనిచేస్తున్న మున్సిపల్‌ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *