ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది.. నయనతార చెప్పిన కర్మ సిద్ధాంతం.. ధనుష్ గురించేనా.. ?

హీరోయిన్ నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే సుమారు మూడు పేజీలతో ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది నయన్. హీరో ధనుష్ ను ఉద్దేశిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు మరోసారి తన ఇన్ స్టాలో షాకింగ్ పోస్ట్ చేసింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైలెంట్‏గా ఉన్న వార్.. ఇప్పుడు రచ్చకెక్కింది. నానుమ్ రౌడీ సినిమా నుంచి మూడు సెకన్ల వీడియో ఉపయోగించినందుకు రూ.10 కోట్లు కట్టాలని ధనుష్ కోర్టు నోటీసులు పంపడంపై నయన్ సీరియస్ అయ్యింది. ధనుష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఇన్ స్టోలో సుధీర్ఘ నోట్ షేర్ చేసింది. నయనతారతోపాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ పై కూడా ధనుష్ దావా వేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు నయనతారకు మద్దతు తెలిపారు. ఇక ధనుష్ ఫ్యాన్స్ తమ హీరోకు అండగా నిలబడ్డారు. అయితే నయన్ చేసిన విమర్శలపై ధనుష్ నేరుగా స్పందించలేదు. కానీ ఆమె డాక్యూమెంటరీ స్ట్రీమింగ్ అనంతరం మరోసారి కోర్టు నోటీసు పంపించారు. దీనిపై కోర్టు సైతం నయనతారను వివరణ కోరింది.

ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్టాలో నయన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమె ధనుష్ ను టార్గెట్ చేసి మరీ ఇలాంటి పోస్ట్ చేసిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘అబద్ధాలతో ఎదుటివారి జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు సైతం అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.. కర్మ సిద్ధాంతం ‘ అంటూ ఓ నోట్ షేర్ చేసింది. అయితే నయన్ ఎవరి గురించి ప్రస్తావించకుండానే ఈ పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఈ పోస్ట్ ధనుష్ ను ఉద్దేశిస్తూ చేసిందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో ఆమె జీవితం, కెరీర్, ప్రేమ, పెళ్లి గురించి డాక్యూమెంటరీని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే ఇందులో ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ సినిమాలోని ఓ క్లిప్ ఉపయోగించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై నయన్ వివరణ ఇవ్వాల్సిందే అని కోర్టు కూడా ఆదేశించింది.

About Kadam

Check Also

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌.. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌కు కీలక పదవులు..?

మహారాష్ట్ర కొత్త సీఎం క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *