స్పెర్మ్ ఫేసియల్.. చర్మ సౌందర్యానికి సరికొత్త చికిత్స..

కొంతమంది హాలీవుడ్ భామలు తమ చర్మ సౌందర్యానికి వీర్యంతో ఫేసియల్ చేసుకోవడం కారణమని చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ ఫేసియల్ ప్రత్యేకమైన సాల్మన్ చేపల నుంచి సేకరించింది కావడం గమనార్హం. ఈ చికిత్స భారత్లో సైతం ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఫేసియల్స్​తో పాటు వివిధ రకాల క్రీములు, చికిత్సలను వాడుతారు. కొంతమంది ముఖ్యంగా సినీ తారలు, మోడల్స్​ కొన్ని రకాల ఇంజెక్షన్ల ద్వారా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు మరో కొత్త రకమైన విధానం ట్రెండింగ్​లో ఉంది. ఇందుకు కారణం హాలివుడ్​ తారలు జెన్నీఫర్​ అనిస్టాన్​, కిమ్​ కర్దాషియన్​ వంటివారు ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించడమే. కానీ ఈ పద్ధతి వినడానికి, ఊహించుకోవడానికి కొద్దిగా వికారంగా అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్లు చేసుకునేది స్పెర్మ్​ (వీర్యం) ఫేసియల్​. వీళ్లు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు చాలామంది ఇలాగే భావించారు. అయితే తొందరపడకండి. ఇక్కడ ఉపయోగించేది చేపల వీర్యాన్ని మాత్రమే. అవును, తాము ప్రత్యేకంగా పెంచిన సాల్మన్​ చేపల నుంచి సేకరించిన వీర్యాన్ని ఫేసియల్​ ఉపయోగిస్తున్నామని కర్దాషియన్, జెన్నీఫర్​ వెల్లడించారు.

ఇది కొత్తేమీ కాదు.. కానీ

ఇలా చేపల వీర్యంతో బ్యూటీ ప్రొడక్టులు తయారు చేయడం కొత్తేమీ కాదు. వీర్యంతో పాటు అందులోని డీఎన్​ఏతో రకరకాల సౌందర్య ఉత్పత్తులను అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇంజక్షన్లకు, రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.

భారత్​లోనూ అందుబాటులో..

సాల్మన్​ స్పెర్మ్​ ఫేసియల్స్​ భారత్​లోనూ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి ధర బ్యూటీ క్లినిక్​లను బట్టి సుమారు రూ.10 వేల నుంచి రూ.50 మధ్య ఉంది.

అసలేంటీ స్పెర్మ్ ఫేసియల్​..

వీటిని పాలీన్యూక్లియోటైడ్​ చికిత్సలు అని కూడా పిలుస్తారు. ఈ ఫేసియల్​లో సాల్మన్​ స్పెర్మ్​ నుంచి తీసుకున్న డీఎన్​ఏ ఇంజెక్ట్​ చేస్తారని ప్రముఖ ప్లాస్టిక్​ సర్జన్​ రిచర్డ్ వెస్ట్రీచ్​ తెలిపారు. ఇది చర్మాన్ని స్టిఫ్​గా, ఆరోగ్యంగా ఉంచుతూనే మంచి రూపాన్ని ఇస్తుంది. ఈ స్పెర్మ్​లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల పర్యావరణం నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది. చర్మంపై ముడతలను సైతం తగ్గిస్తాయి. అయితే అనుభవజ్ఞులైన చర్మవ్యాధి నిపుణుల సమక్షంలోనే ఈ చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఇందులో నాణ్యత తక్కువగా ఉన్నట్లయితే అలెర్జీ, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.

About Kadam

Check Also

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే…

ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *