విదేశాల్లో న్యూ ఇయర్ కి వెల్కం చెప్పాలనుకుంటున్నారా.. వీసా ఫ్రీ దేశాలు ఇవే..

పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వీసా రహితంగా పర్యటించే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నూతన సంవత్సర సమయం వేళ మీరు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే భారతీయ పౌరులు వీసా లేకుండా పర్యటించే అందమైన దేశాల గురించి తెలుసుకుందాం..

డిసెంబర్ నెలలో అడుగు పెట్టాం దీంతో నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సన్నాహాలు ప్రారంభించారు. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆశ.. కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొంతమంది తమ కుటుంబంతో ఇంట్లోనే ఉంటూ ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటారు. అయితే చాలా మంది ఎక్కడికైనా బయటకు అందమైన ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఎక్కడైనా న్యూ ఇయర్ జరుపుకోబోతున్నట్లయితే.. అందులోనూ విదేశాలలో జరుపుకోవడానికి ప్లాన్ చేస్తుంటే వీసా రహిత దేశాలల్లో పర్యటించడం మంచి అనుభూతినిస్తాయి.

భారతీయ పౌరులకు వీసా రహిత ప్రవేశం లభించే అనేక దేశాలు ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో భారతీయులు అడుగు పెట్టాలంటే తప్పనిసరి. అయితే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా కొన్ని దేశాలకు వెళ్ళవచ్చు. అయితే గత కొంతకాలంగా చాలా పెద్ద దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వీసా లేకుండా వెళ్ళగలిగే అందమైన దేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

బెలారస్: రష్యా నుంచి స్వాతంత్ర్యం పొందిన బెలారస్ ఒక అందమైన దేశం. ఐరోపాను సందర్శించాలనుకుంటే బెలారస్ సందర్శించండి. ఈ దేశం రష్యాతో సరిహద్దును పంచుకుంటుంది. ఇక్కడ అధికారిక భాష రష్యన్. భారతీయ పౌరులు 30 రోజుల పాటు వీసా లేకుండా ఇక్కడ తిరగవచ్చు. ఇక్కడ మీరు ఐలాండ్ ఆఫ్ టియర్స్ , మీర్ కాజిల్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

భూటాన్: వీసా లేకుండా భూటాన్‌లో కూడా పర్యటించవచ్చు. విశేషమేమిటంటే ఇక్కడ వీసా ఫ్రీకి టైమ్ లిమిట్ లేదు అంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే తిరగొచ్చు. భూటాన్ భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది. శాంతియుత వాతావరణాన్ని ఇష్టపడే వారికి ఈ దేశం సరైన ఎంపిక.

ఇరాన్: భారతీయులు వీసా లేకుండా 15 రోజుల పాటు మిడిల్ ఈస్ట్ దేశం ఇరాన్‌లో కూడా ప్రయాణించవచ్చు. ఇరాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 4, 2024న భారతీయ పౌరులకు వీసా ఉచిత సౌకర్యాన్ని కల్పించింది. ఇరాన్‌లో గ్రాండ్ బజార్, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇరాన్, గోలెస్తాన్ ప్యాలెస్ , సాదాబాద్ కాంప్లెక్స్‌లను సందర్శించడం మర్చిపోవద్దు.

మాల్దీవులు: ఈ దేశంలోని అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సెలబ్రిటీలు కూడా చాలా మంది సందర్శించడానికి ఇక్కడికి వస్తుంటారు. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 90 రోజుల పాటు మాల్దీవుల వీసాను ఉచితంగా సందర్శించవచ్చు. ఇక్కడ అద్భుతమైన బీచ్‌లో నూతన సంవత్సర వేడుకలు కూడా అద్భుతంగా ఉంటాయి.

థాయిలాండ్: థాయ్‌లాండ్‌లోని భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యం నవంబర్ 11, 2024తో ముగియనుంది. అయితే ఇక్కడి ప్రభుత్వం ఇప్పుడు ఈ వీసా ఫ్రీ సౌకర్యాన్ని నిరవధికంగా పొడిగించింది. మీరు బ్యాంకాక్‌లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవచ్చు. చియాంగ్ మాయి, ఫాంగ్ న్గా బే, ఫుకెట్‌లో జరుపుకోవచ్చు.

అయితే ఇక్కడ ఇచ్చిన సమాచారం నవంబర్ 18, 2024 నాటికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఇచ్చింది.. వీసా సంబంధిత అసౌకర్యాన్ని నివారించడానికి ఆయా దేశాల రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

About Kadam

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *