తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ.. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

ఆరోగ్యశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ జారీ చేసింది.రెండ్రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈమేరకు జూన్ 10 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలకనుంది.

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. తాజాగా మరో 2322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్‌, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1931 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలిపింది. అయితే ఇప్పటికే ఆయా పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదల కాగా మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

About Kadam

Check Also

అల్పపీడనం అలెర్ట్.. తెలంగాణకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *