సీఎం చంద్రబాబుతో ఒకరోజు.. ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్.. ముందుగా ఆయనకే అవకాశం..

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన డే విత్ సీబీఎన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటికి ఆహ్వానించారు.

టీడీపీ అధికారంలోకి రావడానికి విదేశాలనుంచి వచ్చి కష్టపడిన ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏకంగా వన్ డే అంతా ఉండే అవకాశం కల్పించింది. ఇది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోవడమే కాకుండా పలువురికి ఇన్స్పిరేషన్ అవుతుందన్నది కార్యక్రమ ఉద్దేశం.. ఇందుకోసం రూపొందించిన “ఏ డే విత్ సీబీఎన్” అనే కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ సోమవారం సీఎంతోనే గడిపారు. స్వీడన్ నుంచి వచ్చి ఎన్నికల సమయంలో 5 నెలల పాటు పార్టీ కోసం పనిచేసారు. ఇలా పార్టీ కోసం పనిచేసిన వారికి సీఎంతో ఒక రోజంతా ఉండే అవకాశం కల్పించింది పార్టీ.. ఎన్నికల్లో ఉత్తమ సేవలు అందించిన నవీన్‌ను ఇంటికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాకుండా.. రాష్ట్రం అభివృద్ధి, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు.

ఎన్ఆర్ఐల కోసం.. డే విత్ సీబీఎన్..

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన డే విత్ సీబీఎన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎంతో ఉండే అవకాశాన్ని కల్పించారు.

విదేశాల నుంచి వచ్చి వందలాది మంది.. ఐదు నెలలపాటు..

సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో స్వీడన్ నుంచి వచ్చిన నవీన్ కుమార్ 5 నెలల పాటు తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు పిలుపు మేరకు వందల సంఖ్యలో ఎన్ఆర్ఐలు సొంత రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును సీఎం చేస్తే.. కలిగే ప్రయోజనాలు, అవకాశాలపై ప్రజలను చైతన్య పరిచారు. అలా నాడు విదేశాలనుంచి వచ్చి ఎన్నికల్లో పనిచేసిన వారికి గౌరవించుకునే కార్యక్రమంలో భాగంగా..నాటి సేవల్లో టాప్ లో ఉన్న వారికి పిలిచి గౌరవించాలని సీఎం భావించారు. ఈ క్రమంలో నాడు పార్టీ కుప్పం సహా శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట, చంద్రగిరి నియోజకవర్గాల్లో తెలుగు దేశం అభ్యర్థుల గెలుపుకోసం నవీన్ చేశారు. ఈ క్రమంలో నవీన్ ను సిఎం ఇంటికి పిలిచిమాట్లాడారు.

రోజంతా సీఎంతోనే…

రోజంతా సీఎం నివాసంలో ఉన్న నవీన్ ముఖ్యమంత్రి రోజూ వారీ రివ్యూలు, పనితీరు ను గురించి తెలుసుకున్నారు. రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐలు వివిధ దేశాల నుండి ఎన్నికల సమయంలో సొంతూళ్లకు వచ్చి పని చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రం బాగుండాలనే బాధ్యతతో పని చేసిన ఎన్ఆర్ఐలు అందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

మరపురాని అనుభూతి

దేశంలో ప్రముఖ నేత అయిన చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక రోజంతా ఉండడంపై నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబును అభిమానించే వారికి, నేడు తనకు ఇచ్చిన అవకాశం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని నవీన్ అన్నారు. స్వయంగా సిఎం ఒక రోజు పనితరును దగ్గర ఉండి చూసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి నవీన్ ధన్యవాదాలు తెలిపారు.

About Kadam

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *