ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు తుది గడువు పెంచిన NTR హెల్త్‌ వర్సిటీ.. ఎప్పటివరకంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిచింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 29వ తేదీలోగా చేరాల్సిఉంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిచింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 29వ తేదీలోగా చేరాల్సిఉంది. అయితే సెప్టెంబరు ఒకటో తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కాలేజీల్లో చేరడానికి అవకాశం ఇస్తూ రిజిస్ట్రార్ రాధికారెడ్డి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆంధ్రా, ఎస్వీయూ పరిధిలో మొత్తం 3,929 సీట్లుండగా.. తొలి విడతలో మొత్తం 3,750 సీట్లు భర్తీ అయినట్లు వర్సిటీ వెల్లడించింది.

ఇక మిగిలిన ప్రత్యేక కేటగిరీ సీట్ల కేటా యింపునకు సంబంధించి ఆయా డైరెక్టరేట్ల నుంచి ప్రాధాన్య క్రమాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నట్లు పేర్కొంది. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది ఆయా రాష్ట్రాల్లో మెరుగైన కాలేజీల్లో చేరాలనుకునే వారికి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్‌ను సైతం పొడిగించింది. ఈ గడువును సెప్టెంబరు మూడో తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ పేర్కొంది.

తెలంగాణ ఎల్‌ఎల్‌బీలో 6,218 మందికి సీట్లు కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లాసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. తొలి విడతలో మొత్తం 6,218 మందికి సీట్లు కేటాయించారు. కన్వీనర్‌ కోటాలో మూడేళ్లు, ఐదేళ్లు కలిపి ఎల్‌ఎల్‌బీ సీట్లు మొత్తం 7,540 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌లో 14,201 మంది విద్యార్ధులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలో 4,685 మందికి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లు, 1533 మందికి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ పాండురంగా రెడ్డి తెలిపారు. సీట్లు పొందిన వారు సంబంధిత కాలేజీల్లో సెప్టెంబరు 4వ తేదీలోపు ఫీజు చెల్లించి రిపోర్టు చేయాలని సూచించారు.

About Kadam

Check Also

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *