వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌.. పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ..

వన్‌నేషన్‌ వన్‌ ఎలక్షన్‌.. జమిలి ఎన్నికల బిల్లుకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక్కడి నుంచి రాజకీయం మరో మెట్టు ఎక్కబోతోంది. అయితే పార్లమెంటులో శుక్రవారం, శనివారం రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఈరోజు రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో మాట్లాడనున్నారు. మొత్తం 12 గంటల సమయాన్ని కేటాయించారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షా ప్రసంగిస్తారు. అయితే రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందంటూ.. ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో.. శనివారం ప్రధాని మోదీ పార్లమెంటు వేదికగా ప్రసంగించనున్నారు. అయితే ఈరోజు కాంగ్రెస్‌ నుంచి ఎంపీ ప్రియాంక గాంధీ ప్రసంగించే అవకాశాలున్నాయి.

మరోవైపు జమిలి బిల్లుకి కేంద్రం ఆమోదం తెలపడం.. డ్రాఫ్ట్‌ బిల్లుని ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతుండడంతో అనేక పార్టీలు వ్యతిరేకబావుటా ఎగరవేస్తున్నాయి. జమిలి వల్ల దేశానికి వచ్చే లాభమేమీ లేదంటూ మండిపడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా.. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందంటున్నారు స్టాలిన్‌. ఫెడరలిజంని నాశనం చేసి.. గవర్నెన్స్‌కు పెను విఘాతం కలిగిస్తుందని విమర్శించారు.

మరోవైపు అసదుద్దీన్‌ ఒవైసీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రాంతీయ సమస్యలు ప్రాధాన్యతగా నిలుస్తాయని.. లోకల్‌బాడీస్‌కు వేరే సమస్యలుంటాయని.. అదే జనరల్‌ ఎలక్షన్స్‌కు వేరే అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రజలు ఓటేస్తారన్నారు. అలాంటిది ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీలు వీక్‌ అయిపోతాయని.. ఇది పెద్ద కుట్ర అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌.. జమిలి ఎన్నికల బిల్లు రాజ్యంగ విరుద్దమంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

జమిలి ఎన్నికల బిల్లుకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత కొన్ని పార్టీలు దీనిని వ్యతిరేకించగా.. ఎన్డీఏ పక్షాలు దీనిని స్వాగతించాయి.. అయితే.. మరికొన్ని పార్టీలు దీనిపై ఇప్పటివరకు స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది..

About Kadam

Check Also

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *