బీహార్‌లో రాజ్య జీవికా నిధి శాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇది మహిళా ఎస్‌హెచ్‌జీలు, గ్రామీణ కాపరేటివ్స్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే మహిళలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు ప్రధాని.

‘అమ్మ మన ప్రపంచం.. అమ్మే మన ఆత్మగౌరవం. సంపన్నమైన సంప్రదాయాలతో నిండిన ఈ బీహార్‌లో కొన్ని రోజుల క్రితం జరిగినదాన్ని నేను అస్సలు ఊహించలేదు. బీహార్‌లో RJD-కాంగ్రెస్ నా తల్లిని అవమానించారు. ఇది నా తల్లికి జరిగిన అవమానం మాత్రమే కాదు.. దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు కలిగిన అవమానాలు. నాకు తెలుసు.! మీరందరూ, బీహార్‌లోని ప్రతి తల్లికి ఇది విన్నాక బాధ కలిగి ఉంటుంది. నాకు ఎంత బాధ కలిగిందో.. బీహార్ ప్రజలకు కూడా అదే బాధలో ఉన్నారని’ ప్రధాని మోదీ అన్నారు.