ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్లకు మల్కాపూర్ చెరువులో ట్రయల్ రన్ నిర్వహించారు. 14.5 టన్నుల బరువుతో ఉన్న ఈ యుద్ధ ట్యాంకర్లపై దాదాపు 10 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ఫ్యాక్టరీ. భూమిపైన, నీటిలోన శత్రువులను ఎదుర్కోవడానికి ఇవీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి..ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఆర్మీకి యుద్ధ ట్యాంకులు అందుతున్నాయి. ఈరోజు కూడా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో బీఎంపీ.. బీఎంపీ 2 కె అనే రెండు యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ చేశారు..
కంది మండలం ఎద్దు మైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ప్రతి ఏటా 120 ఈ యుద్ధ ట్యాంకర్ల వాహనాలను తయారుచేసి మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్ రన్ చేస్తారు..అయితే వీటిని ఆర్మీ యుద్ధాలలో ఎక్కువగా వాడుతారు..వీటి బరువు 14 టన్నులు ఉంటుంది… ఈ వాహనాలు రోడ్డు పై 65 కిలోమీటర్ల వేగంతో…నీటిలో 8 కిలోమీటర్ల వేగంతో పడవలాగ వెళ్తాయి..ఈ యుద్ధ వాహనం తయారీకి 8 నుండి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సమాచారం. నీళ్లలో ఏడు నుంచి 8 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లడం, అదే విధంగా రోడ్డుపై 30 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుందని ఓడీఎఫ్ అధికారులు చెబుతున్నారు. యుద్ధ సమయంలో సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఈ వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ వాహనాలు రష్యా టెక్నాలజీతో తయారు చేస్తారు..సైనికులకు ఇప్పటివరకు 3 వేల వాహనాలకు పైగా మెదక్ ఓడీఎఫ్ నుంచి పంపినట్లు అధికారులు తెలిపారు.ఈ యుద్ధ వాహనాలు ఓడీఎఫ్లో ఒకసారి తయారైన వాటిని 15 నుంచి 20 సార్లు వివిధ రకాల టెస్ట్లు చేసిన తర్వాత, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్దారించుకుని, ఆ తర్వాత భారత మిలిటరీకి పంపడం జరుగుతుంది..కాగా నేడు మల్కాపూర్ పెద్ద చెరువు వద్ద యుద్ధ ట్యాంకుల ట్రయల్ రన్ చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు.