బాబోయ్..కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..!- WHO హెచ్చరిక!!

1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి లక్షల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులపై డేంజర్‌ బెల్స్ ఆగటం లేదు. ఇప్పుడు WHO భవిష్యత్తులో మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి ప్రజల్ని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

ఈ భూమ్మీద ఏదైనా ఒక అంటువ్యాధి వచ్చినప్పుడల్లా అది ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. గత 400 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఇదే ఈ విషయం వెల్లడైంది. 1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి లక్షల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. స్పానిష్ ఫ్లూని “మదర్ ఆఫ్ ఆల్ ఎపిడెమిక్స్” అని కూడా అంటారు. దీని కారణంగా 5 కోట్లకు పైగా మరణాలు సంభవించాయి.

మొన్నటికీ మొన్న కరోనా వైరస్ కూడా అంతే ప్రాణాంతకంగా మారింది.. ఇది మిలియన్ల మంది ప్రజలను మృత్యుఒడిలోకి నెట్టింది. దాదాపు మొత్తం ప్రపంచాన్ని వణికించింది. అయినప్పటికీ, ఈ ప్రాణాంతక వ్యాధులపై డేంజర్‌ బెల్స్ ఆగటం లేదు. ఇప్పుడు WHO భవిష్యత్తులో మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి ప్రజల్ని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ‘X’ వ్యాధిగా చెబుతున్న ఈ వ్యాధిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దీన్ని నివారించేందుకు ప్రపంచం మొత్తం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని WHO హెచ్చరించింది. ‘X’ వ్యాధి గురించిన భయంకరమైన విషయం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించింది.

ఈ పేరులేని అంటువ్యాధి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఏ రూపంలోనైనా దాడి చేయగలదని WHO హెచ్చరిస్తోంది. ఈ దాడి ఎవరిపై ఎక్కడ మొదలవుతుందో వైద్య శాస్త్రానికి కూడా తెలియదని ఆందోళన వ్యక్తం చేసింది. అందరూ ప్రజలంతా సరైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని చెబుతున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లను తగ్గించి మేలైన పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

About Kadam

Check Also

చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..

ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *