పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవాల తనయుడు శంకర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి తన మొక్కులు తీర్చుకున్నారు అన్నా లెజీనోవా. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పవన్, అన్నా దంపతుల తనయుడు శంకర్ కు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ సమయంలో అన్నా స్వామివారిని మొక్కుకున్నదట. పవన్ అన్నా దంపతులు పిల్లలతో సింగపూర్ నుంచి భారత్ కు చేరుకున్నారు. ఈ నేపధ్యంలో స్వామివారి దర్శనం కోసం నిన్న(ఆదివారం) తిరుమలకు చేరుకున్నారు. జన్మతః క్రిస్టియన్ అయిన అన్నా కొడుకు కోసం తిరుమలకు చేరుకోవడమే కాదు తిరుమల శ్రీవారిని అన్యమతస్థులు దర్శించుకోవాలంటే ఉన్న నిబంధనలు పాటించారు. ముందుగా గాయత్రి సదనంలో డిక్లరేషన్‌పై లెజినోవా సంతకం చేశారు.
ఆదివారం శ్రీవారికి తలనీలాలు సమర్పించారు అన్నా లెజినోవా. కుమారుడు మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలని తలనీలాల సమర్పించారు. శ్రీవారిని దర్శించుకునే ముందు సంప్రదాయంగా ఆదివారం వరాహస్వామిని దర్శించుకున్నారు పవన్ సతీమణి.
Amaravati News Navyandhra First Digital News Portal