రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా..?

PM Kisan: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా ప్రతియేటా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు అందిస్తోంది. చిన్న,సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. రైతు లకు ఆర్థికసాయంగా ఏడాదిలో మూడుసార్లు రూ. 2వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది..

రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి పీఎం కిసాన్‌ స్కీమ్‌ను తీసుకువచ్చారు. దీనిని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేల చొప్పున రైతులకు అందిస్తోంది కేంద్రం. ఈ డబ్బులు ఒకే సారి కాకుండా ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తోంది. ఈ సందర్భంలో పథకం 18వ విడత 5 అక్టోబర్ 2024న అందించగా, ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో తదుపరి టర్మ్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.

పీఎం కిసాన్‌ కోసం దరఖాస్తు చేయడం ఎలా?

  • పథకం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inకి వెళ్లండి.
  • కొత్త రైతు నమోదు చేసుకునే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • అక్కడ అడిగిన వివరాలను పూరించండి. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించండి.
  • తర్వాత మీ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్‌ చేయండి.

మొబైల్ నంబర్‌ను ఎలా లింక్ చేయాలి?

పీఎం కిసాన్‌ స్కీమ్‌లో పలువురు రైతులు మొబైల్‌ నంబర్‌ను లింక్‌ చేయకపోవడంతో డబ్బులు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ పథకంలో వారు తమ సెల్ ఫోన్ నంబర్‌ను లింక్‌ చేయడం తప్పనిసరి. మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేసుకోవచ్చు.

  • ముందుగా pmkisan.gov.in కు లాగిన్ అవ్వండి.
  • ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయండి. అందులో మొబైల్‌ని అప్‌డేట్ చేయండి
  • నంబర్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డు వివరాలను అందించి OTP పొందండి. తర్వాత OTP సమాచారాన్ని నమోదు చేసి, ఎంటర్ బటన్‌ను నొక్కండి.
  • ఇందులో మీ సెల్ ఫోన్ నంబర్ అప్‌డేట్ అవుతుంది. అదేవిధంగా పథకం లబ్ధిదారుల సమాచారం గురించి సులభంగా తెలుసుకోవచ్చు.

డబ్బులు వచ్చాయా? లేదా తెలుసుకోవడం ఎలా?

  • ముందుగా pmkisan.gov.in కి వెళ్లండి.
  • ఫార్మర్స్ కార్నర్ పేజీకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డ్ నంబర్ లేదా ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
  • చెల్లింపు చరిత్రపై క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారులు స్థితిని తెలుసుకోవచ్చు.

About Kadam

Check Also

అనుమానంతో కారులో అణువణువు తనిఖీ.. కనిపించింది చూసి ఖాకీలు స్టన్..

ఓ వ్యక్తి కారులో దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంటర్ అయ్యారు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *