సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్తవ్య భవన్ లోకి దశలవారిగా కేంద్ర మంత్రుల కార్యాలయాలను తరలిస్తారు. ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్ లోకి మార్చారు. కర్తవ్యభవన్‌లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు.
భారతదేశ పాలనకు గుండెకాయలా నిలిచిన కొన్ని భవనాలు వాటి స్థితి మార్చుకుంటున్నాయి. ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి, వందేళ్ల క్రితం నాటి రాతి కట్టడం నుంచి కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చేసింది. ఈ క్రమంలోనే మరికొన్ని కీలక పాలన కార్యాలయాలు సైతం రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారనున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఇప్పటి వరకు రైసీనా హిల్స్‌పై కొలువైన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో ఉండే ప్రధాని కార్యాలయం సహా రక్షణశాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ మంత్రిత్వ శాఖలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ కానున్నాయి. వాటిని కొత్తగా నిర్మించిన కర్తవ్య భవన్‌కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ కీలక శాఖలకు కేంద్రంగా నిలిచే కొత్త భవనం కర్తవ్య భవన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆరంతస్థుల ఈ భవనంలో 1.5 లక్షల చదరపు మీటర్లు ఉంది. ఇందులో హోం, విదేశాంగ శాఖలు ఉండనున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం నార్త్‌బ్లాక్‌లో ఉన్న హోంశాఖ కార్యాలయాన్ని కర్తవ్య భవన్‌లోకి తరలిస్తున్నారు. ఈ కర్తవ్య భవన్‌లో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 67 సమావేశ గదులు, 27 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, MSME మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి.