భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీలో ప్రధాని మోదీకి ఆపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం భద్రత కల్పించింది. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. సౌదీ అరేబియాను విశ్వసనీయ స్నేహితుడుగా, వ్యూహాత్మక మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పడినప్పటి నుండి, ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన విస్తరణ జరిగిందని ఆయన అన్నారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు తన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఒక పోస్ట్‌లో తెలియజేశారు. ప్రధానమంత్రి మోదీ తన రెండు రోజుల గల్ఫ్ దేశ పర్యటనలో భాగంగా త్వరలో జెడ్డా చేరుకుంటారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో రెండు దేశాలు పరస్పరం ప్రయోజనకరమైన, బలమైన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశం – సౌదీ అరేబియా కలిసి ముందుకు సాగుతాయని ప్రధాని మోదీ చెప్పినట్లు అరబ్ న్యూస్ తెలిపింది. ఇరు దేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచం కోసం శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తారన్నారు.
సౌదీ అరేబియా రక్షణ మార్కెట్‌పై గ్లోబల్‌డేటా సమాచారం ప్రకారం, మధ్యప్రాచ్య ప్రాంతంలో బోయింగ్-నిర్మిత రక్షణ వేదికల అతిపెద్ద ఆపరేటర్లలో కింగ్‌డమ్ ఒకటి. దాని రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో 207 F-15 SA , 62 F-15 ఈగిల్ జెట్ ఫైటర్లు ఉన్నాయి. ప్రధాని మోదీ ఏప్రిల్ 22 – 23 తేదీలలో సౌదీ అరేబియా పర్యటనలో ఉంటారు.