దేశ ప్రజలకు ప్రధాని మోదీ బర్త్‌డే గిఫ్ట్.. ఈ నెల 17న సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం!

సెప్టెంబర్ 17న తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పనున్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జేపీ నడ్డా తన ఎక్స్‌ ఖాతా వేదికగా వెల్లడించారు.

తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహుమతిని అందించనున్నారు. దేశంలోని మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం సోమవారం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జేపీ నడ్డా తన ఎక్స్‌ ఖాతా వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 75,000 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాలు మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన ముఖ్యమైన సేవలను అందిస్తాయి.

అలాగే పోషకాహారం, ఆరోగ్య అవగాహన, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడానికి అన్ని అంగన్‌వాడీలలో పోషణ్ మాహ్ అనే కార్యక్రమం ద్వారా ఇది నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కుటుంబాలు, సాధికారత కలిగిన సంఘాలను నిర్మించడం ఈ చర్యల లక్ష్యం. అలాగే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ వాటాదారులు ముందుకు వచ్చి ఈ జన్ భాగీదారీ అభియాన్‌లో పాల్గొనాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. “ఇండియా ఫస్ట్” మన ప్రేరణగా, విక్షిత్ భారత్ కోసం మన సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

About Kadam

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *