మోడీనా మజాకానా.. చైనాలోనూ మన ప్రధానే ప్రధాన ఆకర్షణ.. సోషల్ మీడియాలో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండింగ్

ప్రధాని మోడీ రెండో రోజు చైనా పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు, అక్కడ మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ , రష్యా అధ్యక్షుడు పుతిన్‌లను కలిశారు. ఇప్పుడు ప్రధాని మోడీకి సంబంధించిన వార్తలు చైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పుతిన్ కారులో కూర్చున్న తర్వాత.. మోడీ చైనీస్ సెర్చ్ ఇంజన్ బైడు , చైనీస్ ‘ట్విట్టర్’ వీబోలో అగ్రస్థానంలో ట్రెండింగ్‌ అవుతున్నారు.

ప్రధాని మోడీ ప్రజాదరణ కేవలం భారతదేశం లేదా అమెరికా-బ్రిటన్ దేశాలకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు చైనా పేరు కూడా ఈ జాబితాలో చేరింది. వాస్తవానికి ప్రధాని మోడీ చాలా ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు. డ్రాగన్ కంట్రీ మోడీకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలికింది. అప్పటి నుంచి ప్రధాని మోడీ చైనా సోషల్ మీడియాలో కూడా ఆధిపత్యం చెలాయించడం మొదలు పెట్టారు. ఆయన గురించి వీబోలో చర్చించుకుంటున్నారు. దీనిని అక్కడ ట్విట్టర్ అని పిలుస్తారు.

ప్రధాని మోడీ చైనాలో రెండు రోజు పర్యటన కోసం అడుగు పెట్టారు. ఆయనకు చైనా ప్రతిష్టాత్మకమైన మేడ్ ఇన్ చైనా హాంగ్కీ కారును అందించారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కూడా తన అధికారిక పర్యటనలలో ఈ కారును ఉపయోగిస్తారు. దీనితో పాటు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ప్రధాని మోడీ ఒకే కారులో సమావేశానికి బయలుదేరారు. ఈ కారు ఆరస్ కారు. ఇది పుతిన్ అధ్యక్షుడి కారు. దీనికి చైనా దౌత్య నంబర్ ప్లేట్ ఉంది.

చైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రధాని మోడీ

పుతిన్ కారులో ప్రధాని మోడీ కూర్చున్నప్పటి నుంచి ఆయన చైనీస్ ‘ట్విట్టర్’ వీబోలో ట్రెండింగ్ అవ్వడం ప్రారంభించారు. ‘మోడీ పుతిన్ కారు తీసుకున్నారు’ అనేది ప్రస్తుతం వీబోలో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. దీనితో పాటు చైనా సెర్చ్ ఇంజిన్ బైడులో కూడా ప్రధాని మోడీ గురించి అత్యధికంగా శోధిస్తున్నారు. ఇక్కడ మోడీ, పుతిన్ లు కౌగిలించుకుని చేతులు పట్టుకుని మాట్లాడారు. అనేది టాప్ ట్రెండ్ అవుతుంది. చైనా ప్రజలు మోడీ గురించి మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం Weiboలో నంబర్ వన్ ట్రెండ్:

ప్రస్తుతం చైనీస్ సెర్చ్ ఇంజిన్ బైడులో నంబర్ వన్ సెర్చ్ ట్రెండ్:

చైనాలో ప్రధాని మోడీ ఏం అన్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ SCO సమావేశంలో ఉగ్రవాదాన్ని ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన పహల్గామ్ దాడిని కూడా ప్రస్తావించారు. భారతదేశం గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తూ.. ఉగ్రవాదాన్ని ఎలా అంగీకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అన్ని రూపాల్లో, రంగుల్లో ఉన్న ఉగ్రవాదాన్ని మనం అందరం కలిసి వ్యతిరేకించాలని మోడీ పిలుపునిచ్చారు. ఇది మానవత్వం పట్ల మన అందరి బాధ్యత అని చెప్పారు.


About Kadam

Check Also

297 శాతం పెరిగిన ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంత వస్తాయో తెలిస్తే షాకే..

మహిళల ప్రపంచ కప్ 2025 కోసం రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ చీఫ్ జై షా ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *