AI టెక్నాలజీలో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. పారిస్‌లో జరుగుతన్న AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ దీనిపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటించబోతున్నారు. AI టెక్నాలజీని సామాన్యుడికి కూడా చేరేవిధంగా కేంద్రం కృషి చేస్తోంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ దూసుకెళ్లోంది. AI రంగానికి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్యుడికి కృత్రిమ మేథ ఫలాలను అందించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మోదీ పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌కు వివిధ దేశాధినేతలు, ప్రపంచ టెక్ CEOలు హాజరవుతున్నారు. కొత్త ఆవిష్కరణలు, సైబర్ క్రైమ్ భద్రత, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతకు సహకార విధానాన్ని పెంపొందించడంపై ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. AI ప్రపంచ పురోగతిని ఎలా నడిపించగలదో, ప్రజా శ్రేయస్సుకు ఎలా దోహదపడుతుందో చర్చించనున్నారు.
భారత్‌లో స్టార్టప్స్ , విద్యార్ధులకు , కొత్త ఆవిష్కరణలకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. AI రంగంలో భారత్‌ను గ్లోబల్ లీడర్ చేయడమే మోదీ లక్ష్యం. గత ఏడాది ఈ రంగానికి కేంద్రం రూ.10300 కోట్ల కేటాయించింది. ఇండియన్ AI మిషన్‌కు ఈ నిధులను వచ్చే ఐదేళ్ల పాటు ఖర్చు చేస్తారు. భారతీయ భాషల్లో AI టెక్నాలజీని వినియోగిస్తూ ముందుకెళ్లబోతున్నారు. AI టెక్నాలజీలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు చాలా కీలకం. 18,693 జీపీయూలను సరఫరా చేసేందుకు 10 కంపెనీలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. వచ్చే 10 నెలల్లో భారత్ కూడా సొంతంగా జీపీయూలను తయారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారత ప్రభుత్వం 2023 లోనే మూడు కీలకరంగాలైన ఆరోగ్యం , వ్యవసాయం , పట్టణాభివృద్ది కోసం మూడు AI సెంటర్లను ఏర్పాటు చేసింది. రూ. 500 కోట్లతో దేశవ్యాప్తంగా కొత్త AI సెంటర్ల ఏర్పాటు చేస్తున్నారు. AI రంగంలో యువతను తీర్చిదిద్దేందుకు ఐదు జాతీయ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే డిజిటల్ ఇండియా భాషిని భారతీయ భాషల్లో డిజిటల్ సర్వీసెస్‌ను AI టెక్నాలజీ అందిస్తోంది.
పారిస్ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో భారత్ కోచైర్ పాత్ర పోషిస్తోంది. ఈ పర్యటనలో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం మోదీ, మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2047 హారిజన్ రోడ్‌మ్యాప్ కింద జరుగుతున్న పరిణామాలను ఇద్దరు నేతలు సమీక్షించనున్నారు. ఈ రోడ్‌మ్యాప్ ద్వైపాక్షిక సంబంధాలను, ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతికత, రక్షణ వంటి కీలక రంగాలలో మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ చారిత్రాత్మక ఫ్రెంచ్ నగరమైన మార్సెయిల్‌కు వెళతారు. ఇద్దరు అధినేతలు ఫ్రాన్స్‌లో మొదటి భారత కాన్సులేట్‌ను ప్రారంభిస్తారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. భారత ప్రధాన మంత్రి అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER) ప్రాజెక్టును సందర్శిస్తారు.