కడప జిల్లాలో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఒక ఐదేళ్ల బాలికపై కన్నేసిన కామాందుడు.. ఆ పాపపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని చితబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. రోడ్లపై ఆడ పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలా తమ వక్రబుద్ది చూపిస్తున్నారు. అక్కడ ఉన్నది పసిపిల్లా, పండు ముసలా అని కూడా చూడట్లేదు. కామంతో కల్లుమూసుకుపోయి వాళ్లపై పడి తమ కామ కోరికలను తీర్చుకుంటున్నారు. వీటిని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు అమలు చేస్తున్నా.. సమాజంలో ఇలాంటి ఘటనలు తగ్గడం లేదు.. రోజూ ఎక్కడోదగ్గర వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లాలోనూ జరిగింది. కానీ అదృష్టవశాత్తు స్థానికుల అప్రమత్తంతో ఆ చిన్నారి ఓ కామాందుడి వల నుంచి తప్పించుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కడప నగరంలోని భగత్ సింగ్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న ఒక ఐదేళ్ల బాలికపై కన్నేసిన ఒక దుండగుడు. ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచారం చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో బాలికతో మొల్లగా మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఈ దుండగుడి నుంచి బాలికను రక్షించారు. ఆ తర్వాత అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
అయితే ఘటనపై కేసు నమోదు చేసుసి దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన నిందితుడి రాజ్ కుమార్ పై ఇప్పటికే ఒక హత్యాయత్నం కేసుతో పాటు మొత్తం ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్టు డీఎస్పీ బాలస్వామి రెడ్డి తెలిపారు.