ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

110 మంది పోలీసులు, 11 బ్రృందాలు 24 గంటలు పని చేస్తే కేసును ఛేదించడానికి ఏడు రోజులు సమయం పట్టింది.. కేవలం 7 తరగతి చదివిన తిరుమాని శ్రీధర్ వర్మ అలియాస్ చేకూరి శ్రీధర్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకే సవాల్ విసిరాడు. నేరం ఎలా చేయాలి, దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, పట్టుకున్నా శిక్ష పడకుండా ఎలా బయట పడాలి. ఈ త్రిముఖ వ్యూహంతో ఆపరేషన్ సిద్ధ – చేప పేరుతో క్రైం కథ నడిపాడు.

ఏంటి ఈ ఆపరేషన్ సిద్ధ?

ఉండి మండలం యండగండికి చెందిన సాగి తులసి తల్లిదండ్రుల నుంచి వచ్చే భూమి, బంగారం ఎలా కొట్టేయాలనే దానికి సంబంధించిన ప్రణాళిక పేరు ఆపరేషన్ సిద్ధ.. సిద్ధ అంటే సిద్ధాంతి.. చేప అంటే తులసి.. తిరుమాని రేవతి అలియాస్ చేకూరి రేవతి . వీరిద్దరికి వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. రేవతి కులాంతర వివాహం చేసుకోవటాన్ని తులసి అంగీకరీంచలేదు. ముఖ్యంగా ఈ కథలో తులసి (చేప )ని వల వేసి తమ బుట్టలోకి వచ్చే విధంగా చేసుకునేందుకు రేవతి, తన భర్త శ్రీ ధర్ వర్మకు పూర్తిగా సహకరించింది. తులసికి 11 సంవత్సరాల క్రితం నిడదవోలు సుబ్బరాజు తోటకు చెందిన సాగి శ్రీను బాబుతో వివాహం జరిగింది. అయితే అప్పులు పాలైన ఆమె భర్త 2012లో ఆమెను వదిలి పరారయ్యాడు. ఇప్పటి వరకు అతని జాడ లేదు. ఈ క్రమంలో తన కుమార్తెతో కలిసి తులసి గరగపర్రులో ఉంటుంది. ఈక్రమంలోనే ఆమెకు ప్రభుత్వం ఇంటి స్ధలం మంజూరు చేయటంతో ఆమె ఎండగండిలో ఇళ్లు కొట్టుకుంటుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంతో అది మధ్యలో ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రేవతి ఆమె భర్త శ్రీధర్ వర్మలు గత జూలైలో ఆపరేషన్ సిద్ధ‌కు శ్రీకారం చుట్టారు. తులసి కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని అందుకే నీ భర్త నిన్ను వదిలిపోయాడు అంటూ ఆమెను మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే రాజమండ్రి క్షత్రియ పరిషత్ పేరుతో సహాయం చేస్తున్నామని గత సెప్టెంబరు 11, 21 తేదీల్లో వరుసగా పెయింట్ డబ్బాలు, టైల్స్ పంపారు. ఇక ఈ నెల 19న మరోసారి ఎలక్ట్రికల్ సామాన్లు, మోటార్‌ను పంపుతున్నట్లు ఫోన్ చేసి శవాన్ని బట్వాడా చేశారు.

బోల్తా కొట్టిన ఆపరేషన్ సిద్ధ

చేతబడి చేశారని నమ్మించటానికి ఒక శవాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. అయితే అనాధ శవాలు దొరక్కపోవడంతో కాళ్ల గాంధీనగర్‌కు చెందిన పర్లయ్యను పనికి పిలిచి మద్యం మత్తులో ఉండగా హతమార్చారు. ఈ శవాన్ని పార్శిల్ చేసేందుకు అవసరమైన పెట్టెలు స్వయంగా తయారు చేసుకున్నారు. ఈ శవం యండగండి పంపారు. తులస కి ఎవరో చేతబడి చేయడం వల్లే నీ భర్త కనిపించకుండా పోయాడని, అప్పులు పాలయ్యడని తమకు సిద్ధాంతి చెప్పాడని నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పుల వాళ్లు శవాన్ని కూడా పంపుతారంటూ చెప్పారు. పథకం ప్రకారం శవాన్ని పంపి ఏమీ తెలియనట్టు రంగరాజు ఇంటికి చేరుకుని వాళ్లకు నేను డబ్బు చెల్లిస్తాను. మీ ఆస్తి నా పేరు మీద రాయమని శవం సంగతి తాను చూసుకుంటానని చెప్పాడు శ్రీధర్ వర్మ.. అయితే తులసి తెలివిగా వ్యవహరించి బంధువులకు, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో తనతో సహజీవనం చేస్తున్న సుష్మ అలియాస్ విజయలక్ష్మితో కలిసి పరారైన శ్రీధర్ వర్మ చివరికి పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా సుష్మ, రేవతి, శ్రీధర్ వర్మ ఈ ముగ్గురు కోడ్ భాషలో సిద్ధ అని తమ ప్లాన్ గురించి మాట్లాడుకోవటం తులసిని చేపగా సంభోదించటం చేసేవారిని పోలీసులు దర్యాప్తులో తేలింది.

About Kadam

Check Also

హనీట్రాప్‌ కేసులో సంచలన ట్విస్ట్‌.. ఈసారి బయటకొచ్చిన NRI బాధితులు..!

విశాఖ హనీట్రాప్‌ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్‌ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్‌ ఫోకస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *