అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాాదం జరిగింది.

అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది.  అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టి షర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారటూ కేటీఆర్ చురకలు వేశారు. తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి నీది అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. బతకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ లోపలికి రానీకుండా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను  పోలీసులు అడ్డుకున్నారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేశారు. టీషర్లు తీసివేస్తే లోపలికి అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు. వారితో కేటీఆర్, హారీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అసెంబ్లీ ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరెస్ట్‌ అయ్యారు. అదానీ-రేవంత్‌ టీషర్టులతో అనుమతించబోమని బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.  అదానీ, రేవంత్‌ దోస్తానా అంటూ టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. గన్‌ పార్క్‌ దగ్గర అమరులకు నివాళులు అర్పించిన తర్వాత టీషర్టులు ధరించి అసెంబ్లీకి బయల్దేరారు.అయితే అసెంబ్లీ గేటు దగ్గర భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తమని లోనికి వెళ్లనివ్వాలంటూ గేటు దగ్గర నిరసన తెలిపారు. భద్రతా సిబ్బందితో బీఆర్‌ఎస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. వెంటనే నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్‌ చేసి.. బలవంతంగా వ్యానులో తరలించారు పోలీసులు.

About Kadam

Check Also

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *