కోడి పందేలకు కోర్టు చిక్కులు…హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముంది…

సంక్రాంతి అంటేనే ఎంతో సందడిగా ఉండే పండుగ. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటిముందు రంగు రంగుల రంగవల్లులు ఇలా ఒక్కటేమి సంక్రాంతి వచ్చిందంటే చాలు గ్రామీణ ప్రాంతాల గ్రామాలు సందడిగా మారిపోతాయి. మరోపక్క పెద్ద ఎత్తున సాంప్రదాయం పేరుతో కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. ఎన్ని చర్యలు చేపట్టిన పండుగ మూడు రోజులు మాత్రం పందాలు జరిగి తీరుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు.

సంక్రాంతి పండుగ వేళ.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అధికారుల సైతం అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు, జంతు హింస జరగకుండా చూడాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌.చక్రవర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.  ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కలెక్టర్ జిల్లా వేట్రీ సెల్వి అధికారులు ఆదేశించారు. సంక్రాంతి సంబరాల పేరిట జంతుహింస జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు మేరకు జిల్లాలో రెవిన్యూ, పోలీస్ యంత్రాంగం, స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సంబరాల పేరిట కోడిపందేలు, జూదాలు జరుగకుండా చూసేందుకు జిల్లాలో అన్ని మండలాల్లో 28 సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు గట్టినిఘాతో తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కమిటీల్లో మండల తహశీల్దారు, ఎస్ హెచ్ఓ, ఎన్ జివో ప్రతినిధి, ఇద్దరు కానిస్టేబుల్స్, ఇద్దరు వీడియో గ్రాఫర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. కోడిపందేలు, బెట్టింగులు, జూదాలు లాంటి అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఈ కమిటీలు పనిచేస్తాయనీ అదే విధంగా ఈ సమన్వయ కమిటీలు ప్రజల్లో కోడిపందేలు నియంత్రణపై అవగాహన కల్పిస్తారనీ, కోడి పందేలతోపాటు పేకాట గుండాట లాంటి జూద క్రీడలను ఎట్టి పరిస్ధితుల్లో ఉపేక్షించరాదన్నారు. కోడిపందేలు నిషేదంపై గ్రామాల్లో టాం టాం వేయడం, మైక్ ప్రచారం, తదితర విస్తృత ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో కోడిపందాల నిర్వహణపై ఏలూరుకు చెందిన బలే నాగలక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దుగ్గిరాల్లో చింతమనేని కాకతీయ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న కోడిపందాలను అడ్డుకోవాలని పిల్‌లో కోర్టును కోరారు నాగలక్ష్మి.. గతంలో కోడిపందాల నిరోధానికి ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని, కోర్టు ఆదేశాలను అమలు చెయ్యాలేని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద తాము మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలిపారు. సంక్రాంతికి సాంప్రదాయాల ముసుగులో ప్రజాప్రతినిధులు జూదాలను ప్రోత్సహిస్తున్నరంటూ పిటిషన్లో నాగమణి పొందుపరిచారు. అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చెయ్యాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో కోడిపందాలు జరుగుతాయా జరగవా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే మరోవైపు పందెం రాయుళ్లు ప్రతియేటా సాంప్రదాయ కోడిపందాలు తప్పకుండా జరుగుతాయని చెబతున్నారు.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *