డిగ్రీ అర్హతతో ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తులకు డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ప్రసార్ భారతి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు జోన్‌లలో అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, న్యూదిల్లీ, ఈశాన్య జోన్‌లలో ఖాళీగా ఉన్న..

భారత ప్రభుత్వ ప్రజా సేవా ప్రసార సంస్థ అయిన ప్రసార్ భారతి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు జోన్‌లలో అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, న్యూదిల్లీ, ఈశాన్య జోన్‌లలో ఖాళీగా ఉన్న టెక్నికల్ ఇంటర్స్న్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 421 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 1, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • టెక్నికల్ ఇంటర్న్స్‌ ఇన్‌ సౌత్‌ జోన్‌లో పోస్టుల సంఖ్య: 63
  • టెక్నికల్ ఇంటర్న్స్‌ ఇన్‌ ఈస్ట్‌ జోన్‌లో పోస్టుల సంఖ్య: 65
  • టెక్నికల్ ఇంటర్న్స్‌ ఇన్‌ వెస్ట్‌ జోన్‌లో పోస్టుల సంఖ్య: 66
  • టెక్నికల్ ఇంటర్న్స్‌ ఇన్‌ నార్త్‌ ఈస్ట్‌ జోన్‌లో పోస్టుల సంఖ్య: 126
  • టెక్నికల్ ఇంటర్న్స్‌ ఇన్‌ న్యూఢిల్లీలో పోస్టుల సంఖ్య: 101

ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీలో ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలక్ట్రానిక్స్‌, టెలీకమ్యునికేషన్, ఎలక్ట్రికల్‌, సివిల్, ఐటీ లేదా కంప్యూటర్‌ సైన్స్ విభాగాల్లో కనీసం 65 శాతం ఉత్తీర్ణత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. 2024-25 ఫ్రెషర్స్‌ గ్రాడ్యుయేట్స్‌ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జూన్‌ 16, 2025 తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా జూలై 1, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు 2025 జూన్‌ 16వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ మొత్తం ఏడాది పాటు ఉంటుంది. ఈ సమయంలో స్టెపెండ్‌ నెలకు రూ.25,000 చొప్పున అందిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

About Kadam

Check Also

చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..

ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *