వడోదర బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం… మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

గుజరాత్‌లోని వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పద్రా దగ్గర మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిపోయింది. అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు. నదిలో వాహనాలు పడిపోవడంతో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే ముప్పు ఉంది.

రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి. రెస్క్యూ అపరేషన్ కొనసాగుతుంది. గల్లంతు అయిన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగుర్ని కాపాడామని.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. వడోదర – ఆనంద్ జిల్లాలను కలుపుతూ గంభీర బ్రిడ్జి నిర్మించారు. ఇప్పుడు బ్రిడ్జి కూలడంతో ఆనంద్, వడోదర, భారూచ్, అంకాళేశ్వర్ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. 1985లో నిర్మించిన ఈ వంతెన పాతబడడంతో పాటు.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అయితే బ్రడ్జి కూలిన ఘటనపై అధికారుల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా.. పాత వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేయలేదు. ఇప్పటికే మరమ్మత్తులు అవసరమైన వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు మరింత శిథిలావస్థకు చేరుకుంది.ఈ క్రమంలోనే బుధవారం వాహనరాకపోకలు సాగిస్తున్న సమయంలో బ్రిడ్జ్‌ ఒక్కసారిగా కుప్పకూలిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వంతెన కూలిన ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి వంతెన కూలడానికి గల కారణాలను గుర్తించాలని టెక్నికల్‌ టీమ్‌కు ఆదేశాలు జారీ చేశారు. నదిలో పడిన వాహనాలను తొలగించడానికి వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నాయి.

About Kadam

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *