ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడంటే..?

భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలపడనుంది. రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో పారిస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఈ పర్యటన జరగవచ్చని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం.

రష్యా తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ కూడా భారత్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2025 ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. భారతదేశాన్ని చాలా ముఖ్యమైన దేశంగా ఫ్రాన్స్ అభివర్ణించింది.

ఫిబ్రవరి 2025లో పారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫ్రాన్స్ ఆహ్వానించింది. తప్పుడు సమాచారం, సాంకేతిక దుర్వినియోగంతో సహా ప్రధాన AI అంశాలు ఈ సమ్మిట్‌లో చర్చించనున్నారు. ప్రెసిడెంట్ మాక్రాన్ సమ్మిట్ లక్ష్యాలకు భారతదేశం సంభావ్య ప్రభావాన్ని, సహకారాన్ని అందించనుంది. AI సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ పారిస్‌కు వెళతారని, ఈ సమయంలో ద్వైపాక్షిక సమావేశం కూడా జరగవచ్చని భావిస్తున్నారు. దీంతో రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పీఎంవో వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే రెండు దేశాల మధ్య రక్షణ పరంగా సహాయ, సహకారాలు అందించుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే ఖరారైన రక్షణ ఒప్పందం మొత్తం వ్యయం దాదాపు 10 బిలియన్ డాలర్లు. ఇందులో 26 రాఫెల్ M ఫైటర్ జెట్‌లు, మూడు అదనపు స్కార్పెన్ కేటగిరీ సాంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఈ ఒప్పందాలు రాబోయే కొద్ది వారాల్లో కేబినెట్ సెక్యూరిటీ కమిటీ (CCS) ఆమోదం కోసం సమర్పించారు.

About Kadam

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *